Summer Health Tips: వేసవికాలంలో ఆరోగ్య పరిరక్షణ చాలా అవసరం. ఎందుకంటే ఎండల వేడిమి కారణంగా బాడీ డీహైడ్రేట్ అవుతుంటుంది. డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు, ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఈ ఫ్రూట్ సలాడ్ అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం డీ హైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా ఆరోగ్యం అందిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎండ వేడిమి కారణంగా శరీరం తరచూ డీహైడ్రేట్ అవుతుంటుంది. వేడి కారణంగా ఏదీ తినాలన్పించదు. దాంతో విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. వేసవిలో శరీరం పోషక పదార్ధాలు కోరుకుంటుంది. పోషక పదార్ధాలు కావల్సిన పరిమాణంలో లేకపోవడంతో ఇమ్యూనిటీ పడిపోతుంటుంది. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుకుంటే వేసవి దుష్పరిణామాలు ప్రభావం చూపించవు. అందుకే మీ రెగ్యులర్ డైట్‌లో ఫ్రూట్ సలాడ్ చేర్చితో మంచి ఫలితాలుంటాయి. వేసవిలో ఎలాంటి ఫ్రూట్ సలాడ్ అవసరమో తెలుసుకుందాం..


మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్


వేసవిలో మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తప్పకుండా తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సీజన్‌లో లభించే అన్ని రకాల పండ్లను ముక్కలుగా కోసి కలిపి సేవించాలి. దీనికోసం పైనాపిల్, కివీ, బొప్పాయి, మామిడి పండ్లను సలాడ్‌లో తీసుకోవాలి. 


వేసవిలో కాలంలో ఫ్రూట్ సలాడ్ కారణంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. కడుపు నిండి ఉంటుంది. అందుకే బరువు తగ్గించుకునే ప్రక్రియలో ఫ్రూట్ సలాడ్ విరివిగా తింటారు. ఫ్రూట్ సలాడ్ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. ఫ్రూట్ సలాడ్‌లో వాటర్ మెలన్ తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే శరీరానికి కావల్సిన విటమిన్ ఎ, విటమిన్ సి ఇందులో సమృద్ధిగా లభిస్తుంది. కివీ, లిచీ తినడం వల్ల శరీరానికి కావల్సిన పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలెట్, పొటాషియం లభిస్తాయి. దాక్ష, స్ట్రాబెర్రీ వంటి పండ్లు తీసుకోవడం వల్ల విటమిన్ సి, పొటాషియం, రైబోఫ్లెవిన్ పోషకాలు సమృద్ధిగా అందుతాయి.


Also read: Vitamin B12 Foods: విటమిన్ బి12 తగ్గితే శరీరం గుల్లయిపోవడం ఖాయం, ఎలాంటి ఆహారం తినాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook