Summer Health Tips: ఏప్రిల్ నెల రాకముందే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పడగాలులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఎండలు పెరిగే కొద్దీ.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అనారోగ్యాలతో బాధపడే వారు ఎండలో వెళ్లకపోవడమే మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎండలో బయటకు వెళ్లేవారు ఈ జాగ్రత్తలు పాటించండి..


మైగ్రేన్‌తో బాధపడే వారు ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఎక్కువసేపు సూర్యరశ్మిలో ఉన్నా.. చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. చర్మ వ్యాధులు ఉన్నవారు ఎండలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. లేదంటో బయటకు వెళ్లేప్పుడు గొడుగు, కళ్ళద్దాలు, టోపీ, స్కార్ఫ్ వెంట తీసుకెళ్లండి. సన్ స్క్రీన్ లోషన్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. 


ఎండ నుంచి ఉపశమనం కోసం..


అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి శరీరంలో నీటి స్థాయి అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా నీరు తాగాలి. దీంతో పాటు కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకుంటే మంచిది. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది.


పోషకాహారం ముఖ్యం


వేసవిలో జీర్ణశక్తి తగ్గిపోతుంది. దీంతో అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే వేసవిలో ఎల్లప్పుడూ జీర్ణమయ్యే లేదా తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. మసాలా, అధిక ప్రోటీన్ లేదా జిడ్డుగల ఆహారాన్ని తినకపోవడమే మంచిది. దానికి బదులు రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తినడం మేలు. వేసవిలో పాలక్, పొట్లకాయ, టమోటాలు, దోసకాయలు, పుచ్చకాయలు, నారింజ, బేరి వంటి కూరగాయలను తినొచ్చు.


తగిన విశ్రాంతి ముఖ్యం


వేసవిలో చాలా అలసట కూడా ఉంటుంది. అందుకే వేసవిలో మధ్యాహ్నం పూట కాస్త విశ్రాంతి తీసుకోవాలి. లంచ్ తర్వాత 20 నిమిషాలు పడుకోండి. ఇది మీ అలసటను తగ్గిస్తుంది. రోజంతా పని చేసే శక్తిని ఇస్తుంది.


వ్యాయామాలు


వేసవిలో ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వెళ్తే మేలు జరిగింది. ఇది కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. చల్లటి గాలిలో నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం సహా తీవ్ర ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. 


Also Read: Watermelon Benefits: పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?


Also Read: Watermelon Seeds Benefits: పుచ్చకాయ విత్తనాలను పడేస్తున్నారా? వాటి ఉపయోగాలు తెలుసుకోండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.