Swelling Problems: తరచుగా శరీరంపై వాపులు వస్తున్నాయా.. అయితే ప్రమాదమే..!
Swelling Problems: మానవ శరీరంలో అన్ని భాగాలు ఏదో ఒక అవయవంతో అనుసంధానించి పని పని చేస్తాయి. ఒక భాగంలో ఉన్న సమస్య మరొక భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇటీవలే చాలా మందిలో శరీరం, ముఖం, కళ్ల చుట్టూ వాపులు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
Swelling Problems: మానవ శరీరంలో అన్ని భాగాలు ఏదో ఒక అవయవంతో అనుసంధానించి పని పని చేస్తాయి. ఒక భాగంలో ఉన్న సమస్య మరొక భాగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇటీవలే చాలా మందిలో శరీరం, ముఖం, కళ్ల చుట్టూ వాపులు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారు తప్పకుండా వైద్యుని సంప్రదించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఈ వాపులు చర్మంపై సంభవిస్తే శరీరంలో ఎదైనా సమస్యగా భావించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమస్య బాడీలో పదే పదే వస్తుంటే.. మీ శరీరంలో ఈ 5 రకాల వ్యాధులతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇవే ఆ ఐదు వ్యాధులు:
కాలేయ వ్యాధి (Liver Disease) :
శరీరంలోని కాలేయ భాగంలో ఏదైనా సమస్య ఉంటే.. శరీరంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. లివర్ డిజార్డర్ వల్ల పొట్టలో వాపు పెరగడం మొదలవుతుంది. కాబట్టి పొట్టలో ఎదైన సమస్య ఉన్నప్పుడు.. ఖచ్చితంగా చెకప్ చేయించుకోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
థైరాయిడ్ (Thyroid):
ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది ఎక్కువ లేదా తక్కువ స్రవించడం వల్ల శరీరానికి సమస్యలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. గొంతు, కాళ్ళలో వాపు పెరిగితే.. దాని వెనుక 'హైపోథైరాయిడిజం' కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
డీప్ వెయిన్ థ్రాంబోసిస్(Deep Vein Thrombosis):
ప్రస్తుతం చాలా మందిలో కాళ్ళలో వాపు సమస్యలు పెరుగుతున్నాయి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఇది కాళ్ళలో వాపును కలిగించే వ్యాధి. కాళ్ళ సిరలలో రక్తం గడ్డకట్టడంతోపాటు.. నొప్పి పెరగడానికి కారణం అవుతుంది. శరీరంలోని కొన్ని భాగాలలో రక్తం గడ్డకట్టడం వల్ల అక్కడ వాపు ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గుండె జబ్బులు (Heart Disease):
చేతులు, తొడలపై వాపు కనిపిస్తే.. అది గుండె సమస్యలకు దారి తీయోచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గుండెలో సమస్యలు అనేక ఇతర వ్యాధులకు కారణం కావచ్చు. కావున ఇలాంటి వాపులుంటే వైద్యుని సంప్రదించడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కిడ్నీ వ్యాధి (Kidney Disease):
పాదాలు, ముఖంపై తరచుగా వాపు ఎక్కువగా ఉంటే.. ఇది మూత్రపిండాల సంబంధిత వ్యాధులకు కారణం కావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే.. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం పోయి.. ఇది శరీరంలోని వాపును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేయకండి.. ఈ విధంగా చేస్తే సమస్యలు తప్పవు..!
Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook