Vitamin D: విటమిన్ డి కోసం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
Vitamin D Supplements: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అన్నా.. ఎముకలు దంతాలు బలంగా, దృఢంగా ఉండాలి అన్నా.. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ డి ఉండడం ఎంతో అవసరం. ఇండియాలో ఇప్పుడు 76% వరకు విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు అందుకని డాక్టర్ ను కూడా అడగకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండానే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ తెలుసుకుందాం..
Vitamin D Supplements:
మన శరీరానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన విటమిన్స్ లో విటమిన్ డి ఒకటి. శరీర నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించే ఎముకలు , దంతాలు దృఢంగా ఉండాలి అంటే మన శరీరంలో అవసరమైన మోతాదులో విటమిన్ డి ఉండి తీరాలి. మన శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడంలో విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మారుతున్న జీవనశైలి ,ఆహారపు అలవాట్లు కారణంగా ప్రస్తుతం ఇండియాలో సుమారు 76 శాతం మంది విటమిన్ డిఫిషియన్సీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
అందుకని చాలామంది డాక్టర్ సంప్రదింపు లేకుండా, ఎటువంటి ప్రస్క్రిప్షన్ తీసుకోకుండా స్వతహాగా మార్కెట్ లో దొరికే విటమిన్ డి సప్లిమెంట్స్ ని తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సహజంగా మనకు సూర్య రశ్మి ,ఆహారం ద్వారా పుష్కలంగా లభ్యమయ్యే విటమిన్ డి కోసం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరంలోకి వెళ్లే విటమిన్స్, మినరల్స్ వీలైనంతవరకు మనం తీసుకునే ఆహారం ద్వారా లభ్యమైతే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ ఇలా మందుల ద్వారా శరీరానికి అన్నివేళలా అందించడం సరైన పద్ధతి కాదు.
పొద్దున నిద్రలేచి కాసేపు ఎండలో తిరగాలి అని పెద్దలు ఎప్పటినుంచో చెబుతూ ఉంటారు. ఎందుకంటే అలా ఎండలో పొద్దున్నే తిరగడం వల్ల మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. సూర్యరసిని ద్వారా విటమిన్ డి మన శరీరంలో తగు మోతాదులో ఏర్పడుతుంది. అందుకే పొద్దున ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఎండలో కాసేపు కూర్చోవడం వాకింగ్ చిన్న పనులు లాంటివి చేసుకోవడం వల్ల మన శరీరానికి విటమిన్ డి అందడంతో పాటు చర్మ సమస్యలు తగ్గుతాయి, డిప్రెషన్ వంటి ఇబ్బందులు తగ్గుతాయి.
మన శరీరంలో ఎముకలకు కావలసిన క్యాల్షియం అందడం ఆగిపోతుంది. అందుకే ఎముకలు బలహీనపడి పెలుసుగా మారుతాయి. శరీరంలో తెలియకుండా ఎక్కువ విటమిన్ డి డెఫిషియన్సీ ఏర్పడితే చిన్న వయసులోనే కాళ్లు ,కీళ్లు నొప్పులు రావడం లాంటి సమస్యలతో మొదలై క్రమంగా కాస్త దెబ్బలకు కూడా ఎముకలు విరిగే స్థితికి వెళ్ళిపోతారు.
విటమిన్ డి సహజంగా మన శరీరంలో సూర్య రశ్మి కారణంగా స్వయంగా ఉత్పత్తి అవుతుంది. పుట్టగొడుగులు, బాదం పప్పు, చేప, గుడ్డు వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి శరీరంలో తగ్గితే ఎంత ప్రమాదకరమో అవసరానికి మించి శరీరంలో నిల్వ ఉన్న అంతే ప్రమాదకరం. మన శరీరంలో విటమిన్ డి ఎక్కువ అయితే ఆకలి మందగించడం, డీహైడ్రేషన్ ,మూత్రపిండాలలో రాళ్లు ,కిడ్నీ ఫెయిల్యూర్, వికారం ,వాంతులు ,ఎక్కువ కాల్షియం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అనవసరమైన సప్లిమెంట్స్ ద్వారా విటమిన్ డి పెంచుకోవాలి అని ప్రయత్నించకండి. మీ శరీరంలో నిజంగానే విటమిన్ డి కొరత ఉంది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకొని ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల ప్రకారం సేకరించినది. వీటిని పాటించే ముందు ఒకసారి మీ వైద్యున్ని సంప్రదించడం మంచిది
Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook