Tea Addiction: నీరు తర్వాత భారత్‌లో అత్యధికంగా తాగేది టీ ఒక్కటి. ఉదయం లేవగానే చాలా మంది బెడ్ టీని తాగుతారు. అంతేకాకుండా మౌత్‌  రిఫ్రెష్‌ కోసం కూడా టీని తాగుతారు. అయితే దీనిని తాగడం వల్ల శరీరానికి ఎన్ని లాభాలున్నాయో.. అన్నే నష్టాలున్నాయి. టీని అతిగా తాగడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో కెఫిన్ పరిమాణం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం అధికమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఖాళీ కడుపుతో టీ తాగితే పొట్ట సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా టీ తాగే అలవాటు మానుకోండి:


1. టీ తీసుకోవడం తగ్గించండి:


టీ ఒక్కసారి అలవాటైతే దానిని మానేయడం చాలా కష్టం. తల నొప్పితో ఉన్నప్పుడు చాలా మంది మందుకి బదులుగా టీని తాగడాని ఇష్టపడతారు. టీని మానేయడానికి రోజూకు ఒక్కసారి మాత్రమే టీ తాగడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.  అంతేకాకుండా టీ తాగాలని అనిపించినప్పుడు టీకి బదులుగా ఏదైనా తినవచ్చని నిపునులు చెబుతున్నారు.


2. హెర్బల్ టీని తాగొచ్చు:


చాలా మందికి టీ అంటే పిచ్చ.. కానీ కొన్ని కారణాల వల్ల వారు టీని వదులుకోవాల్సి ఉంటుంది. ఇది వారికి చాలా ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ దానిని వదిలివేయకూడదనుకుంటే.. పాల టీకి బదులుగా హెర్బల్ టీని తాగొచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


3. మధ్యాహ్నం టీకి బదులుగా జ్యూస్ తాగండి:


ప్రస్తుతం చాలా మందికి మధ్యాహ్నం టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా అలవాటు అయిన వారు మానుకోవడం చాలా కష్టం..అయితే టీని మానుకోవాలనుకుంటే చాయ్‌కి బదులుగా పండ్ల రసాన్ని తాగాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల వివిధ రకాల శరీర సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Tomato Juice for weight loss: టమోటాలను ఇలా వాడితే కేవలం 15 రోజుల్లో మీ శరీర బరువు సగం తగ్గిపోతుంది


Also Read:  White Onion Benefits: తెల్ల ఉల్లిపాయలను తింటే.. ఈ సమస్యలు దూరమవుతాయి..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.