Tea Benefits: టీలో అవి కలుపుకుంటే..దగ్గు, జ్వరం, జలుబు దూరం
Tea Benefits: మీకు టీ తాగే అలవాటుందా..మీ టీ మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు, వర్షాకాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు కొన్ని పదార్ధాలు కలిపితే అద్భుత ప్రయోజనాలుంటాయి.
Tea Benefits: మీకు టీ తాగే అలవాటుందా..మీ టీ మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు, వర్షాకాలంలో ఎదురయ్యే అనారోగ్య సమస్యల్ని దూరం చేసేందుకు కొన్ని పదార్ధాలు కలిపితే అద్భుత ప్రయోజనాలుంటాయి.
టీ అనేది భారతీయల అలవాటు. వర్షాకాలంలో వేడి వేడి టీ తాగుతుంటే కలిగే అనుభూతే వేరు. వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ టీ తాగితే ఇంకా కిక్ ఇస్తుంది. అదే సమయంలో వర్షాకాలంలో ఎదురయ్యే జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యల్నించి గట్టెక్కేందుకు మీరు ఇష్టంగా తాగే టీలో..కొన్ని రకాల ఆయుర్వేద ఔషధాల్ని కలిపితే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. టీలో ఏం కలుపుకుంటే ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉంటామో తెలుసుకుందాం..
టీలో పసుపు
పసుపులో కర్‌క్యూమిన్, డెస్మెథోక్సీ కర్‌క్యూమిన్, బిస్ డెస్మెథోక్సీ కర్‌క్యూమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అంతర్గత భాగాల్ని పటిష్టం చేస్తాయి. అందుకే ఇష్టంగా తాగే టీలో కొద్దిగా పసుపు కలుపుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవడమే కాకుండా బరువు కూడా తగ్గుతాము. ఇక రెండవది టీలో తులసీ ఆకులు కలుపుకుని తాగడం. ఆయుర్వేద వైద్య విధానంలో తులసి ఆకులకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఒక కప్పు తులసి ఆకులు కలిపిన టీ తాగడం వల్ల ఛాతీ కుదించుకుపోవడం తగ్గుతుంది. ముక్కు క్లియర్ అవుతుంది. అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. తులసి ఆకుల్లో ఉండే విటమిన్ ఏ, డీ, ఐరన్, ఫైబర్ పోషకాలు ఇతర బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అంతేకాకుండా తులసి వల్ల దంతాల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
సత్పర్ణ చెట్టు
వర్షాకాలంలో సాధారణంగా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమల్ని పారద్రోలేందుకు ప్రాచీన సత్పర్ణ చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ చెట్లు బెరడు, వేర్లలో మలేరియా వ్యతిరేక గుణాలుంటాయి. ఇందులో ఉండే జ్వరనాశక గుణాలు జ్వరాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా మలేరియాకు వ్యతిరేకంగా శరీర రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. చర్మ సంబంధిత చాలా సమస్యల్ని దూరం చేస్తుంది. ఇక మరో అద్భుత ఔషధం అల్లం. వర్షాకాలంలో బయటి తిండి కారణంగా కడుపు సంబంధిత సమస్యలు ఎదురౌతాయి. అల్లంతో టీ చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలుంటాయి. అల్లంతో జీర్ణక్రియ, మెటబోలిజం పెరుగుతాయి. మోషన్ సిక్నెస్ దూరమౌతుంది. గొంతు గరగర వంటి సమస్యలు తగ్గుతాయి.
మందారం
రోజూ ఇష్టంగా తాగే టీలో..కొద్దిగా మందారం వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ సి, సయనిన్ పుష్కలంగా ఉంటుంది. వీటివల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.
Also read: Jamun Fruit : నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా.. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook