Tender Coconut Water Benefits: ఎండకాలంలో చాలా మంది వేడి తీవ్రతతో ఇబ్బంది పడతారు. అంతే కాకుండా తీవ్రమైన ఎండల కారణంగా డీ హైడ్రేషన్ గురవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యమని నిపుణులు తెలుపుతున్నారు. శరీరాన్ని  డీ హైడ్రేషన్ నుంచి రక్షించుకునేందుకు మార్కెట్‌లో పలు రకాల రసాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి శరీరానికి అంత మేలు చేయకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేసవిలో ఎలాంటి డ్రింక్స్‌ను తాగడం వల్ల శరీరానికి మంచి లాభాలుంటాయే తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల 4 ప్రయోజనాలు ఉన్నాయి:


వేసవిలో శరీర వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి లేత కొబ్బరి నీరు(Tender Coconut  Water) సహాయ పడతాయి.  ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండడం వల్ల శరీరానికి కావల్సిన అన్ని విటమిన్లు లభిస్తాయి. ఇవి ఎక్కువగా బీచ్‌లో కనిపిస్తాయి. 


లేత కొబ్బరి నీరు వల్ల శరీరాని ఈ 4 లభాలు:
 
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:


పెరుగుతున్న వేడి కారణంగా శరీరంలో రోగనిరోధక స్థాయి తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీరు శక్తిని పెంచడాని కృషి చేస్తుంది.


2. డయాబెటిస్‌పై ప్రభావం చూపుతుంది:


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ కొబ్బరి నీరు ఉండే గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని ఇది డయాబెటిక్ పేషెంట్లు తాగ వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు.


3. కిడ్నీలకు మంచిది:


లేత కొబ్బరి నీరు మూత్రపిండాల సమస్యల నుంచి రక్షణ పొందడాని చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపులు తెలుపుతున్నారు. ఈ నీరును తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్లను తొలగిస్తుందని అభిప్రాయపడుతున్నారు.



4. చర్మం మెరుపునిస్తుంది:


వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీరును తాగడమే కాకుండా, ముఖానికి కూడా రాస్తే మొటిమలు తొలగిపోతాయని పేర్కొన్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Pink Himalayan Salt: పింక్‌ సాల్ట్‌ వాడుతున్నారా..దాని ప్రయోజనాలు తెలుసుకోండి.!!


Also Read:Raw Milk Side Effects: పచ్చి పాలను తాగుతున్నారా..! అయితే మీరు అనారోగ్య బారిన పడటం ఖాయం..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.