Raw Milk Side Effects: పచ్చి పాలను తాగుతున్నారా..! అయితే మీరు అనారోగ్య బారిన పడటం ఖాయం..!!

Raw Milk Side Effects: భారత్‌లో  పాలను ఒక ఆహారంగా భావిస్తారు. ఎందుకంటే పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కావున పాలు తాగడం వల్ల శరీరానికి కావల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు మంచి ఆరోగ్యం కోసం వీటిని తాగలని సూచిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 11:29 AM IST
  • పచ్చి పాలతో శరీరానికి ప్రమాదమే
  • పచ్చి పాలలో లిస్టేరియా, సాల్మోనెల్లా బ్యాక్టీరియా
  • పచ్చి పాలతో విరేచనాలు, కీళ్లనొప్పులు, డీహైడ్రేషన్
Raw Milk Side Effects: పచ్చి పాలను తాగుతున్నారా..! అయితే మీరు అనారోగ్య బారిన పడటం ఖాయం..!!

Raw Milk Side Effects: భారత్‌లో  పాలను ఒక ఆహారంగా భావిస్తారు. ఎందుకంటే పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. కావున పాలు తాగడం వల్ల శరీరానికి కావల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు మంచి ఆరోగ్యం కోసం వీటిని తాగలని సూచిస్తారు. భారత్‌ పాలను వివిధ రకాల వంటకాలలో కూడా ఉపయోగిస్తారు. కొంత మంది శరీర దృఢత్వం కోసం నేరుగా వాటిని తాగుతారు. లేదా పాలతో తయారు చేసిన ఉత్పత్తులను తింటారు.  అయితే చాలా మంది పెద్దలు పచ్చి పాలును తాగడం మంచికాదని చెబుతున్నారు.  పచ్చి పాలను తాగడం వల్ల శరీరానికి ఎలాంటి నష్టాలు వస్తాయో తెలుసుకుందాం..

పచ్చి పాలు తాగితే ఏమవుతుంది..?:

పచ్చి పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనేది నిజమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికాస్ హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(Food and Drug Administration of Americas Health Protection Agency) తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చి పాలలో ఎస్చెరిచియా కోలా(scherichia coli), లిస్టేరియా, సాల్మోనెల్లా మొదలైన అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయని..ఇవి శరీరానికి హాని కలిగిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పచ్చి పాలు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

పచ్చి పాలలో ఉండే బ్యాక్టీరియా విరేచనాలు, కీళ్లనొప్పులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పచ్చి పాల ఎందుకు హాని:

పశువుల నుంచి నేరుగ పాలను తీసినప్పుడు పొదుగులో కొన్ని రకాల కలుషిత పదార్థాలు పాలలో కలుస్తాయని వీటిని నేరుగా తాగడం ద్వారా శరీరానికి హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే పాలను మరిగించిన తర్వాతే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Gourd Benefits: సొరకాయతో శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!

Also Read: ndia Covid: దేశంలో అదుపులోకి వస్తున్న కరోనా, కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News