Plants For Good Sleep: మంచి నిద్ర కావాలంటే ఈ 5 మొక్కలు మీ బెడ్‌రూంలో ఉండాల్సిందే..
Plants For Good Sleep: మనం ఇంట్లో ఎన్నో మొక్కలు నాటుకుంటాం. ముఖ్యంగా తులసి చెట్టు, కలబంద మనీప్లాంట్. అయితే, ఇలాంటి చెట్లు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది.
Plants For Good Sleep: మనం ఇంట్లో ఎన్నో మొక్కలు నాటుకుంటాం. ముఖ్యంగా తులసి చెట్టు, కలబంద మనీప్లాంట్. అయితే, ఇలాంటి చెట్లు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇవి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో శ్రేష్టమైన మొక్కలు. అయితే, కొన్ని రకాల మొక్కలు మీ బెడ్‌రూంలో పెట్టుకుంటే నిద్ర కూడా బాగా పడుతుంది.
సాధారణంగా ఈరోజుల్లో విపరీతమైన స్ట్రెస్ కారణం, వర్క్ వల్ల కావచ్చు లేదా ఇతర అనారోగ్య సమస్యలు రాత్రి నిద్ర పట్టడం లేదని చాలామంది అంటుంటారు. దీంతో అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. నిద్రలేమి వల్ల డిప్రెషన్, మలబద్ధకం సమస్యలు కూడా వేధిస్తాయి. వీటికి కొన్ని మందులు వైద్యులు కూడా సూచిస్తారు. అయితే సహజసిద్ధంగా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు మంచి నిద్ర లభిస్తుందట. బెడ్‌రూంలో కొన్ని రకాల మొక్కలు పెట్టుకుంటే మీకు నిద్రలేమి సమస్యలు దరిచేరవు. అలాంటి 5 మొక్కలు ఏం ఉంటాయో తెలుసుకుందాం.
స్నేక్ ప్లాంట్..
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఆ పరిసరాల్లో ఆక్సిజన్ విడుదల చేయడమే కాదు. ఇంటికి కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే, స్నేక్ ప్లాంట్ కూడా మీరు మంచి నిద్రకు ఉపక్రమించడానికి సహాయపడుతుంది. స్నేక్ ప్లాంట్ మీ బెడ్‌రూంలో పెట్టుకుంటే మీకు మంచి నిద్ర పడుతుంది.
పీస్ లిల్లీ..
ఇది చూడటానికి ఎంతో అందంగా కనిపించే మొక్క. ఈ మొక్క కూడా గాలిలోని విషవాయువులను గ్రహించే శక్తి కలిగి ఉంటుంది. ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇది ఉన్న చుట్టు ప్రాంతాలు కూడా హాయిగా ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ రెండిటిలో ఏ బ్రేక్‌ఫాస్ట్ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరగవు..?
ఇంగ్లిష్ ఐవీ..
బెడ్‌రూం మనం అందంగా అలంకరిస్తాం. ఈ ఇంగ్లిష్ ఐవీ మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల పరిసరాల్లో ఉన్న విషవాయువులను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తుంది.
ఈ మొక్కను బెడ్‌రూంలో పెట్టుకున్నా మంచి నిద్రవస్తుంది.
కలబంద..
కలబందకు నిర్వహణ కూడా తక్కువే. ఇది మన ఇంటి పరిసరా ప్రాంతాల్లోని గాలిని శుద్ధి చేస్తుంది. ఇందులో అనేక మెడిసినల్ గుణాలు కూడా ఉంటాయి. కలబంద కూడా గాలిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతాయి.
ఇదీ చదవండి: వంటింట్లోని ఈ 2 వస్తువులు.. బెల్లీఫ్యాట్ తగ్గడానికి కరెక్ట్ చిట్కా..!
జాస్మిన్..
జాస్మిన్ మొక్క కూడా మీకు మంచి నిద్రకు ఉపక్రమించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఇవి స్ట్రెస్ స్థాయిలను తగ్గిస్తాయి. వీటి అరోమా వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ పూలు తెలుపు రంగులో ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter