Poha Vs Idli: ఈ రెండిటిలో ఏ బ్రేక్‌ఫాస్ట్‌ తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగవు..?

Poha Vs Idli: రక్తంలో షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. అంతేకాదు సరైన వర్కౌట్లు లేకుంటే కూడా రక్తంలో షుగర్‌ లెవల్స్ పెరుగుతాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 6, 2024, 11:55 AM IST
Poha Vs Idli: ఈ రెండిటిలో ఏ బ్రేక్‌ఫాస్ట్‌ తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగవు..?

Poha Vs Idli: రక్తంలో షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. అంతేకాదు సరైన వర్కౌట్లు లేకుంటే కూడా రక్తంలో షుగర్‌ లెవల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా మనం ఉదయం లేచిన వెంట నుంచి రాత్రి పడుకునే సమయం వరకు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. కొన్ని రకాల ఆహారాలు డయాబెటిక్ రోగులకు ప్రమాదకరం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి. వాటికి దూరంగా ఉండటం బెట్టర్. ఈరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ ఆహారాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుంటా ఉంటాయో తెలుసుకుందాం. 

ముఖ్యంగా ఉదయం సాధారణంగా అందరు ఇడ్లి, దోశ, పోహా తింటారు. అయితే, ఇడ్లి, అటుకుంటు ఈ రెండిటిలో ఏ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయో తెలుసుకుందాం. మన డైలీ లైఫ్లో బ్రేక్‌ఫాస్ట్‌ అత్యంత కీలకం ఇది రోజంతటికీ తగిన శక్తినిస్తుంది.  ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో అధికశాతం ప్రొటీన్, ఫైబర్‌ ఉండే ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. 

చాలామందికి అటుకులు, ఇడ్లి బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా అటుకుల్లో ఫైబర్, ఐరన్, విటమిన్స్ అత్యధికంగా ఉంటాయి. ఇడ్లి ఆయిల్ లేకుండా తయారు చేసుకుంటారు. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. కానీ, రెండిటితో ఆరోగ్య లాభాలు, నష్టాలు ఉన్నాయి. ఆయుర్వేదిక నిపుణుల ప్రకారం డయాబెటిస్‌ రోగులకు ఏ ఆహారం మంచిదో తెలుసుకుందాం.

అటుకుంటు రైస్‌ తో తయారు చేస్తారు. ఇందులో ఐరన్, విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. ఇందులో పల్లీలు, నిమ్మకాయ, కొత్తిమీరా వేసుకుని తయారు చేసుకుంటారు. ఇది మంచి సమతుల ఆహారం అవుతుంది. ఎందుకంటే ఇందులో కార్బ్స్, న్యూట్రియేంట్లు, మినరల్స్ కలగలిపి ఉంటాయి.అంతేకాదు బరువు తగ్గడానికి ఇది బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌, అంతేకాదు గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. కొలెస్ట్రాల్, హైబీపీ, కేన్సర్‌తో పోరాడేవారికి ఇది మంచి రిసిపీ.

ఇదీ చదవండి: వంటింట్లోని ఈ 2 వస్తువులు.. బెల్లీఫ్యాట్ తగ్గడానికి కరెక్ట్‌ చిట్కా..!

ఆరోగ్య నిపుణుల ప్రకారం షుగర్ పేషంట్లకు ఆరోగ్యానికి రెండూ మంచివే. రైస్‌ కు బదులుగా ఈ రెండూ తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్‌ అత్యధికంగా ఉంటుంది. త్వరగా రక్తంలో షుగర్‌ లెవల్స్ పెరగకుండా కాపాడతాయి.

ఈ రెండూ పేగులో మంచి బ్యాక్టిరియా పెరగడానికి ప్రోత్సహిస్తాయి. అటుకుంటను పారాబాయిలింగ్స్ విధానంలో తయారు చేసి ఎండలో ఆరబెడతారు. ఆ తర్వార ఫ్లాట్‌గా మారడానికి దంచుతారు. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎనిమియా రాకుండా కూడా కాపాడతాయి. షుగర్ రోగులకు ఇది బెస్ట్‌ బ్రేక్‌ఫాస్ట్‌.ఇడ్లి విషయానికి వస్తే ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. ఇది లైట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ముఖ్యంగా ఇందులో ఆయిల్ ఉండదు. అన్ని వయస్సులవారు సులభంగా తీసుకోవచ్చు. ఇందులో ఏ మసాలాలు వాడకుండా వండుతారు.

ఇదీ చదవండి: ఈ 5 సూపర్ ఫుడ్స్ కిడ్నీలో పెరుగుతున్న క్రియాటినిన్ ని అంతం చేస్తాయి..

రెండిటిలో ఏది బెస్ట్‌?
ఇడ్లి ఆయిల్‌ వాడకుండా వండుతారు. అయితే, ఇందులో వైట్‌ రైస్‌ వాడకుండా ఇతర మిల్లెట్లు, పప్పుధాన్యాలు వాడితే ఇది బాడీ మెటబాలిక్ డిజార్డర్‌తో బాధపడేవారికి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం. అంతేకాదు ఇడ్లిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్స్, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది మన పూర్వీకుల కాలం నుంచి తీసుకునే అల్పాహారం. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News