5 Super Foods: ఈ 5 సూపర్ ఫుడ్స్ కిడ్నీలో పెరుగుతున్న క్రియాటినిన్ ని అంతం చేస్తాయి..
Creatine Increase Foods: మూత్రపిండాల్లో క్రియాటినిన్ స్థాయిలు పెరిగితే ప్రమాదం. ఇవి మూత్రపిండాలనే దెబ్బతీస్తాయి. సాధారణంగా మహిళల్లో క్రియాటిన్ స్థాయిలు 0.6 నుంచి 1.1 mg/dl మధ్య ఉండాలి.
Creatine Increase Foods: మూత్రపిండాల్లో క్రియాటినిన్ స్థాయిలు పెరిగితే ప్రమాదం. ఇవి మూత్రపిండాలనే దెబ్బతీస్తాయి. సాధారణంగా మహిళల్లో క్రియాటిన్ స్థాయిలు 0.6 నుంచి 1.1 mg/dl మధ్య ఉండాలి. అయితే, ఓ ఐదు కూరగాయలు మన కిడ్నీల్లో క్రియాటిన్ లెవల్స్ పెరగకుండా నివారిస్తాయి. ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
క్యాప్సికం..
సాధారణంగా క్యాప్సికం మన శరీరానికి ఎంతో మంచివి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అంతేకాదు ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాప్సికంలో విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది మన కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనకు క్యాప్సికం మూడు రంగుల్లో దొరుకుతుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులో క్యాప్సికం అందుబాటులో ఉంటుంది.
పైనాపిల్..
పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మూత్రపిండా ఆరోగ్యానికి ఎంతో మంచివి. పైనాపిల్‌లో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో పొటాషియం, మాంగనీస్, విటమిన్ సీ కూడా ఉంటాయి. ఇవి మన మూత్ర పిండాల్లో క్రియాటినిన్ స్థాయిలు పెరగనివ్వవు. మంచి ఆరోగ్యానికి పైనాపిల్ పండును కొనుగోలు చేసి తినండి.
ఇదీ చదవండి: పరగడుపున బొప్పాయి తింటే లెక్కలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు..
ఆలివ్ ఆయిల్..
ఆలివ్ ఆయిల్‌లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ కంటెంట్ కారణంగా కిడ్నీల్లో క్రియేటినిన్ స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు సాధారణంగానే బరువు పెరుగుతారు. ఈ ఆలివ్ ఆయిల్ డైట్లో చేర్చుకోవడం వల్ల వెయిట్ పెరగకుండా ఉంటారు.
ముల్లంగి..
ముల్లంగి కూడా కిడ్నీల్లో క్రియాటినిన్ లెవల్స్ పెరగకుండా కాపాడతాయి. ఇది మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ముల్లంగిలో పొటాషియం, ఫాస్సరస్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. అందుకే కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు ముల్లంగిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా. ముల్లంగిని కూర మాదిరి కూడా చేసుకుని తింటారు.
ఇదీ చదవండి: ఈ నీళ్లు స్ప్రే చేస్తే చాలు.. తెల్లవెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరుగుతాయి..
ఉల్లిపాయలు..
ఉల్లిపాయను డైట్లో చేర్చుకోవడం వల్ల క్రియాటినిన్ నివారిస్తుంది. ఉల్లిపాయలో విటమిన్ సీ, బీ, మాంగనీస్, ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇది కిడ్నీ వ్యాధితో బాధపడేవారికి మంచిది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి