Gray Hair Remedy: తెల్లవెంట్రకల సమస్యతో చాలామంది ఈరోజుల్లో బాధపడుతున్నారు. కొంతమందికి టీనేజీ నుంచే ఈ సమస్య వేధిస్తుంది. ఇది ఫ్యామిలీ హిస్టరీ, ఇతర ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. దీనికి వేలల్లో ఖర్చులు చేస్తారు. అయినా సరైన ఫలితాలు లభించవు. పైగా ఎక్కువగా కెమికల్స్ ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోతుంది కూడా. దీనికి తక్కువ ఖర్చులోనే మంచి రెమిడీ ఉంది. అవేంటో తెలుసుకుందాం.
వేపలో యాంటీ బ్యాక్టిరయల్ లక్షణాలు ఉంటాయి. యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మంపై దురద ఉంటే తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. అయితే, తెల్లవెంట్రుకల సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుందంటే మీర నమ్ముతారా? అవును వేపతో తెల్లవెంట్రుకల సమస్య సహజంగా తగ్గిపోతుంది.వేపలో ముఖ్యంగా ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ ఉంటాయి. వేపనీటిని జుట్టుకు అప్లై చేస్తే మంచిది. అంతేకాదు వేపలో విటమిన్ ఇ, సీ కూడా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి మంచివి. వేప ముఖ్యంగా జుట్టులో చుండ్రు సమస్యతో బాధపడేవారికి మంచి రెమిడీ. జుట్టు దురదకు మంచి రెమిడీ.
వేపను తగినన్ని నీటిలో మరిగించాలి. ఈ నీటిని జుట్టుకు స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత వేళ్లతో మృదువుగా మర్దన చేసుకోవాలి. దీంతో జట్టు కూడా పెరుగుతుంది. వేపలోని యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి చుండ్రు సమస్యకు తక్షణ రెమిడీ ఇది. వేప పొడి రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
ఇదీ చదవండి: ఈ 2 వస్తువులతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి.. మీ జుట్టు కుదళ్ల నుంచి బలపడుతుంది..
తలస్నానం చేసినప్పుడల్లా వేప నీటిని ఇలా జుట్టుకు స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలను త్వరలోనే పొందుతారు. జుట్టులో తెల్లవెంట్రుకల సమస్య తొలగిపోతుంది. త్వరలోనే మీ జుట్టు కూడా మంచి పెరుగుదలకు ప్రేరేపిస్తుంది. వేపతో హెయిర్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు. వేప పేస్ట్, కలబందతో మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు కూడా.
ఇదీ చదవండి: మీ వంటింట్లో ఉండే ఈ 2 వస్తువులతో మీ ముఖానికి గోల్డెన్ గ్లో ఖాయం..
వేపను మరగకాచి తయారు చేసుకోవచ్చు. లేదా వేప పొడిని గోరువెచ్చని నీటిలో వేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. లేదా ఆకులను నేరుగా వేడి నీటిలో వేసి మరిగించవచ్చు. ఈ నీటిని తెల్లజుట్టు ఉన్న ప్రాంతంలో స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా కొన్ని రోజులకు మంచి ఫలితాలను పొందుతారు. వేప వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి