Iron Rich Fruits: ఈ పండ్లతో రక్తహీనత సమస్యకు గుడ్ బై ! మీ ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి
Fruits Rich In Iron: నేటికాలంలో మార్పిన ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది రక్తహీనత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అంతే ఈ పండు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Fruits Rich In Iron: ప్రస్తుతం మారిన జీవనశైలి మార్పుల కారణంగా చాలా మంది పలు అనారోగ్య సమస్యల బారిన ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. ముఖ్యంగా కొందరిలో రక్తహీనత సమస్య అధికంగా కనిపిస్తుంది. ఈ లోపం కారణంగా చాలా మంది అలసట, నీరసం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మందులు, చికిత్సలు తీసుకుంటున్నారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని ఆహారపదార్థాలను ఉపయోగించి మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
రక్తహీనత అనేది ఒక సాధారణ రక్త సంబంధిత సమస్య. శరీరంలో హీమోగ్లోబిన్ తక్కువగా తయారవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంతో రక్తహీను రక్తహీన సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య వల్ల అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పి, తల తిరగడం, చల్లటి చేతులు, కాళ్ళు, చర్మం పాలిపోవడం, గుండె కొట్టుకోవడం వేగంగా లేదా గట్టిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రక్తహీనతకు కారణాలు:
మన తీసుకోనే ఆహారంలో ఐరన్ తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యలు కలుగుతాయి. అలాగే విటిమిన్ బి - 12, ఫోలేట్ లోపం కారణంగా కూడా ఈ సమస్యలు కలుగుతాయి. ఈ రక్తహీనత సమస్య అధికంగా మహిళల్లో కనిపిస్తుంది. రుతుక్రమం, ప్రసవ సమయంలో రక్తస్రావం ఎక్కువగా బయటకు పోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తలెత్తుతుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని రకమైన ఆహారపదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల మీరు రక్తహీనత సమస్యల బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లును తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టే పండ్లు:
రక్తహీనత సమస్య ఉన్నప్పుడు మీరు తరుచుగా పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి రక్తం లోపించదు. అయితే పుచ్చకాయలను తీసుకోవడం వల్ల ఐరన్ అధికంగా లభిస్తుంది. దీని వల్ల రక్తహీనత సమస్య బారిన పడాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటు ద్రాక్ష పండును తీసుకోవడం వల్ల ఐరన్ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో లభించే క్యాల్షియం, పొటాషియం , విటమిన్ సి శరీరానికి మేలు చేస్తుంది. అలాగే వీటితో పాటు అత్తిపండు ఎంతో సహాయపడుతుంది. రెండు అంజీర్ పండ్లను భోజనానికి ముందు తిన్నట్టయితే రక్తం బాగా పడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. బేరీలు కూడా రక్తహీనత సమస్యకు మంచి పండను అని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ , దానిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరానికి రక్తం కోరత ఉండదు.
వీటితో పాటు స్ట్రాబెర్రీలు, పైనాపిల్ తీసుకోవడం చాలా మంచిది వీటిలోని విటమిన్‌లు, మినరల్స్, శరీరానికి ఎంతో సహాయపడుతాయి. ఈ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ శరీరం ఐరన్ మెరుగ్గా గ్రహించడానికి మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడుతుంటే మీ ఆహారం గురించి మీ వైద్యుడితో మాట్లాడటం చాలా అవసరం. మీకు అవసరమైతే ఐరన్ సప్లిమెంట్‌లను సూచిస్తారు.
Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook