Prevent Cardiac Arrest: ఈ కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం తప్పుడు జీవనశైలి, ఫ్యామిలీ హిస్టరీ ఇతర ఆరోగ్య సమస్యలు. దీంతో పది, ఇంటర్ చివరకు స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా గుండెపోటు బారిన పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం..
మధుమేహంతో బాధపడేవారు గుండెపోటు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగ ఉన్నాయి. రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉండకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. షుగర్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.


సరైన జీవనశైలి..
చిన్నవయస్సులోనే గుండెపోటు రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మీ జీవనశైలి సరిగ్గా ఉండేలా చూసుకోండి. మీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, గింజలు, ఎక్కువ శాతం ఫైబర్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.


ఇదీ చదవండి: Raw Onion: ప్రతిరోజూ పచ్చిఉల్లిపాయ తింటే ఈ 10 రోగాలకు దూరంగా ఉండొచ్చు..


మంచి బరువు..
గుండెపోటుకు గురికావడానికి మరో ప్రధాన కారణం అధిక బరువు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు నిర్వహణ ఉండాలి. ఇలా చేయడం వల్ల కూడా గుండెపోటు నుంచి బయటపడవచ్చు


ఎక్సర్‌సైజ్..
ఎక్సర్‌సైజ్ తప్పకుండా చేయాలి. దీంతో అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. యోగా, ఏరొబిక్ వ్యాయామాలు కూడా మీ గుండెను పదిలంగా చూసుకుంటాయి.


కొలెస్ట్రాల్..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండాలి. కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకుండా కొన్ని ఆరోగ్యకరమైన ఫుడ్స్, దినచర్చలు చేస్తూ కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలి.


ఇదీ చదవండి: డయాబెటిస్‌తో బాధపడేవారు ఈ 5 పండ్లు అస్సలు తినకూడదు..


బీపీ..
బ్లడ్ ప్రెజర్ లెవల్ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఇది కూడా గుండెప్రమాదాలను పెంచుతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter