Stomach Pain: కడుపునొప్పితో బాధపడుతున్నారా? ఇలా చేయండి!
Health Tips: కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి
Health Tips: కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కడుపునొప్పి వల్ల కొన్ని సార్లు చాలా సీరియస్ సమస్యలు వస్తుంటాయి. క్రాంప్స్, మగతగా అనిపించడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఇలా ఎన్నో సమస్యలకు కడుపునొప్పి కారణం అవ్వవచ్చు.
ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు..
ఉదర సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు కేవలం కొన్ని మాత్రలు మాత్రమే తీసుకుంటే సరిపోదు. కొన్ని సార్లు అసలు టాబ్లెట్స్ అందుబాటులో ఉండవు. ఇలాంటి సమయంలో మీరు కొన్ని వంటింటి చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది.
అరటి పండ్లు
చాలా మంది కడుపులోనొప్పి ఉన్నప్పుడు అరటిపండ్లు (Banana) తినడం మంచిది కాదు అని భావిస్తారు. నిజానికి అది అపోహ మాత్రమే. అరటిపండు తినడం వల్ల కడుపునొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే యాంటాసిడ్ వల్ల అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.
నిమ్మరసం
లెమోనేడ్ లేదా నిమ్మరసం తీసుకోవడం మన ఇంట్లో సాధారణంగా జరిగే విషయం. కడపునొప్పి ఉన్నా.. లేదా చాలా గ్యాప్ తరువాత ఆహారం తీసుకుంటున్నా దాని కన్నా ముందు నిమ్మరసం తాగడం చేస్తుంటారు. దీని వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
ALSO READ| Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ ఎందుకో తెలుసా ?
అల్లం ..
అల్లం (Ginger), బెల్లం కలిపి తీసుకుని కొడుపులో నొప్పి తగ్గించుకునే వారిని మనం చూసుంటాం. ఇలా చేయడానికి కారణం.. అల్లంలో ఉండే యాంటీ ఇంఫ్లామేటరీ తత్వాల వల్ల ఇది జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అల్లంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది ఫ్రీరాడికల్స్‌ను తగ్గించి కడుపునొప్పిని తగ్గిస్తుంది.
లవంగాలు
కడుపులో నొప్పి ఉన్నప్పుడు.. కొన్ని లవంగాలను కూడా తీసుకోవచ్చు. లవంగాల వల్ల గ్యాస్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe