Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ మసాలా ఎందుకు అయిందో తెలుసా ?

మసాలా దినుసులు (Spices ) భోజనాన్ని మరింత రుచికరం చేస్తాయి. అయితే ఒక్కో మసాలాకు  ఒక్క ప్రత్యేకత ఉంటుంది. దాని ప్రత్యేకతను బట్టి దానికి విలువ ఉంటుంది.

Last Updated : Sep 23, 2020, 04:37 PM IST
    • మసాలా దినుసులు (Spices ) భోజనాన్ని మరింత రుచికరం చేస్తాయి. అయితే ఒక్కో మసాలాకు ఒక్క ప్రత్యేకత ఉంటుంది.
    • దాని ప్రత్యేకతను బట్టి దానికి విలువ ఉంటుంది. కొన్ని మసాలాలు కలిస్తే అవి అద్భుతమైన రంగు, రుచి, వాసనను కలిగిస్తాయి.
    • అందులో కుంకుమపువ్వు కూడా ఒకటి. మీకు తెలుసా.. ఒక కేజీ కుంకుమ పువ్వు కొనాలి అంటే మీరు రెండున్నర లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
Saffron: కుంకుమపువ్వు అంత కాస్ట్ లీ మసాలా ఎందుకు అయిందో తెలుసా ?

మసాలా ( Masala ) దినుసులు (భోజనాన్ని మరింత రుచికరం చేస్తాయి. అయితే ఒక్కో మసాలాకు  ఒక్క ప్రత్యేకత ఉంటుంది. దాని ప్రత్యేకతను బట్టి దానికి విలువ ఉంటుంది. కొన్ని మసాలాలు కలిస్తే అవి అద్భుతమైన రంగు, రుచి, వాసనను కలిగిస్తాయి. అందులో కుంకుమపువ్వు కూడా ఒకటి. మీకు తెలుసా.. ఒక కేజీ కుంకుమ పువ్వు కొనాలి అంటే మీరు రెండున్నర లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే కుంకుమపువ్వు అనేది బ్యాంకు బ్యాలెన్స్ ను క్షణాల్లో మాయం చేసేస్తుంది. 

ALSO READ|Dry Cough:  ఈ మూడు చిట్కాలు పాటిస్తే పొడిదగ్గు ఇట్టే తగ్గిపోతుంది

అలాగే కుంకుమ పువ్వు ( Saffron) పూసే చెట్టుకు కూడా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చెట్టుల్లో ఒకటి. కుంకుమపువ్వు చెట్టు భారత్ దేశంతో ( India) పాటు, స్పెయిన్, ఇటలీ, జెర్మనీ, స్విడ్జర్లాండ్ లో పెరుగుతాయి.  భారత్ లో జమ్ములోని కింసత్ బార్ ప్రాంతంలో కుంకుమ పువ్వు అధికంగా పండుతుంది. కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో కూడా సాఫ్రాన్ పండుతుంది. లక్షన్నర పువ్వులు కలిస్తే ఒక కేజీ కుంకుమ పువ్వు సిద్ధం అవుతుంది. అందుకే దీనికి అంత విలువ ఉంది.

కేసర్ ను ఎర్ర బంగారం ( Red Gold ) అని కూడా అంటారు.  2300 క్రితం గ్రీకు దేశంలో తొలిసారి కుంకుమ పువ్వు సాగు ప్రారంభం అయింది అని చరిత్రకారులు చెబుతుంటారు. అయితే స్పెయిన్ లో పంటగా దీన్ని విస్తరించారు అని చెబుతారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కుంకుమ పువ్వు సాగు అనేది స్పెయిన్ లోనే జరుగుతుంది. కుంకుమ పువ్వు పరిమళం ఎంత శక్తివంతంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అంటే చుట్టుపక్కల వాతావరణం మొత్తం మొత్తం అది విస్తరిస్తుంది.

ALSO READ|  Health: జీలకర్రతో ఆరోగ్యం మరింత పదిలం

ఒక పువ్వులో మూడు పోగులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందుకే ఒక కిలో కుంకమ పువ్వు తయారు కావాలంటే ఎన్ని పువ్వులు కావాలో మీరే అర్థం చేసుకోవచ్చు.  దాదాపు లక్షన్నర పువ్వులు కలిస్తే ఒక కిలో కుంకుమ పువ్వు తయారు అవుతుంది. ఆయర్వేదం నుంచి వంటలు వండటం వరకు..కుంకుమ పువ్వు అనేది అనేక సందర్భాల్లో ఉపయోగించే వంటకం. రక్తాన్ని శుభ్రపరచడం నుంచి లో బ్లెడ్ ప్రెషర్ ను తగ్గించడం వరకు కుంకుమ పువ్వు సహాయపడుతుంది. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే     ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News