International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం..బరువు తగ్గేందుకు మీ కోసం ప్రత్యేక యోగాసనాలు..!
International Yoga Day: ఇప్పుడున్న ఉరుకులు పరుగుల ప్రపంచంలో యోగా కీలకంగా మారింది. ఒత్తిడిని తట్టుకునేందుకు చాలా మంది యోగా, ధాన్యం వైపు మొగ్గు చూపుతున్నారు.
International Yoga Day: ఇప్పుడున్న ఉరుకులు పరుగుల ప్రపంచంలో యోగా కీలకంగా మారింది. ఒత్తిడిని తట్టుకునేందుకు చాలా మంది యోగా, ధాన్యం వైపు మొగ్గు చూపుతున్నారు. రేపు(జూన్ 21న) ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే వారంతా రెండు మార్గాల ద్వారా వ్యాయామాలు చేస్తుంటారు. ఒకటి తీవ్రమైన వ్యాయామాలు, రెండోది ధాన్యం, యోగా ద్వారా ఫిటెనెస్ సాధిస్తుంటారు.
చాలా మంది తీవ్రమైన వ్యాయామాలు చేస్తే బరువు తగ్గుతామని నమ్ముతుంటారు. దీంట్లో నిజం లేదు. సరైన లయబద్ధంగా యోగాసనాలు వేస్తే బరువు తగ్గొచ్చు. తమ చేతుల ద్వారా ఇదంతా చేయవచ్చు. బరువు తగ్గడానికి పది యోగాసనాలు మీ కోసం..
1. ప్లాంక్ పోజ్(ఫలకాసనం)
ప్లాంక్ పోజ్ ఓ అద్భుతమైన యోగాసనం. ఇది మీరు మరింత దృఢంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈయోగాసనం వేయడం చాలా సులభం..సరళమైనది కూడా. మీ భుజాలు, వీపు, తొడలు వంటి శరీర భాగాలు గట్టి పడేందుకు ఫలకాసనం సహాయపడుతుంది. ఇందులో మూడు రకాల యోగాసనాలు వేయొచ్చు. మీ చేయి, మణికట్టు, మోచేతిని నేలపై ఉంచి..మీ శరీరాన్ని చాప నుంచి పైకి లేపాలి. మీ మెడను కిందకు చూడటానికి ఉపక్రమించండి. ఇలా చేయడం ద్వారా విశ్రాంతి పొందవచ్చు. ఒక్క నిమిషం పాటు ఇలా చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది.
2. విల్లు యోగా(ధనురాసనం)
ఈయోగ ద్వారా శరీర భాగాలను బలోపేతం అయ్యేందుకు సహాయపడుతుంది. ఈ యోగ చేయడం వల్ల కీళ్లు భాగాలు పటిష్ఠం అవుతాయి. ఈయోగలో ముఖం కిందకు ఉంచి, మీ మోకాళ్లను వంచి, మీ మోకాళ్లను మీ చేతులతో పట్టుకోండి. ఇలా చేసేటప్పుడు మీ ఛాతీ, తొడలు నేలపై నుంచి పైకి లేపండి. శ్వాస తీసుకునేలా చూసుకోండి. ఇలా 20 సెకన్ల పాటు చేయండి.
౩. త్రిభుజ యోగా(త్రికోనాసనం)
ట్రయాంగిల్ యోగా అందరికీ సులభతరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల తొడ భాగాలు గట్టి పడతాయి. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కల్గుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును సైతం కరిగిస్తుంది. ఇందులో మీ పాదాలను మూడు అడుగుల దూరంలో ఉంచి వంగి ,మీ ఎడమ కాలును కొద్దిగా కుడివైపు తిప్పి..మీ కుడి పాదాన్ని ముందుకు ఉంచాలి. తర్వాత మీ ఎడమ చేతిని సాగదీయడం ద్వారా పాదాలు, నేలకు తాకండి లేదా మీ కుడి చేతిని పైకప్పు వైపునకు సాగదీయండి. ఈయోగాను 20 నుంచి 30 సెకన్లపాటు చేయండి.
4.వంతెన యోగా(సేతు బంధ సర్వాంగసనం)
వంతెన యోగా చేయడానికి మీరు మీ వీపుపై నేలపై పడుకోవాలి..మీ మోకాళ్లను వంచాలి, మీ పాదాలను నేలపై ఉంచాలి. ఈసమయంలో మీ శరీర భాగాన్నిపైకి లేపండి..మీ చేతిని కింద ఉంచండి. మీ తల, మెడను చాపపై ఉంచాలి. ఈ యోగా వల్ల థైరాయిడ్, గ్లూట్స్, భుజం, వెన్నుముక, తొడలు, వీపుపై ప్రభావం పడుతుంది. జీర్ణక్రియ చురుగ్గా పనిచేస్తుంది. కండరాలు బలోపేతం అవుతున్నాయి.
5. డౌన్ ఫేసింగ్ డాగ్ ఫోజ్(అధో ముఖ స్వనాసనం)
మీరు బరువు తగ్గాలనుకుంటే..స్లిమ్‌గా ఉండాలంటే ఈ యోగా బాగా పనిచేస్తుంది. దీని వల్ల మీ చేతులు, కండరాలు, వీపు ధృడపడుతుంది. ఇందులో మీరు మీ చేతులు, మోకాళ్లను పాదాల దూరంలో ఉంచాలి. తర్వాత మీ మోకాళ్లను నేలపై నుంచి పైకి లేపాలి. ఈక్రమంలోనే మీ కాళ్లను నిటారుగా ఉంచండి. మీ అరచేతుల యొక్క ఒత్తిడిని ఉపయోగించండి. వాటిని నేలపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించండి. ఇలా 10 సెకన్లపాటు చేయండి.
6. కుర్చీ భంగిమ
కుర్చీ యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈయోగా వల్ల మీరు కాళ్లకు బాగా పని చెప్పిన వాళ్లు అవుతారు. కుర్చీ భంగిమలో అనేక యోగాసనాలు ఉన్నాయి. దీనిని చేయడం వల్ల శరీర భాగాలన్నీ కదలుతాయి. బలపడుతాయి. నిటారుగా నిలబడండి..నమస్కారం చేయడం కొరకు మీ అర చేతులను కలపండి..తర్వాత మీ చేతులను మీ తలపైకి ఎత్తండి..తొడలు నేలకు సమాంతరంగా ఉండేలా మోకాళ్లను వంచండి. 30 సెకన్ల పాటు ఈపొజిషన్‌లో ఉండండి.
7.యోధుల భంగిమ(వీరభద్రాసనం)
శరీరంలో బరువు తగ్గడానికి ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. చేతులు, భుజాలు, కాళ్లు పటిష్ఠం అవుతాయి. మొత్తం శరీరాన్ని శక్తివంతంగా మారుస్తుంది. నిటారుగా నిలబడండి..మీ కాళ్లను మూడు నుంచి నాలుగు అడుగుల దూరంలో సాగదీయండి..మీ వీపును నిటారుగా ఉంచండి. మీ మోకాళ్లను వంచండి..సగం శరీర భాగాన్ని పక్కకు తిప్పండి..తర్వాత మీ చేతిని నిటారుగా ఉండేలా పైకి ఎత్తండి..10 సెకన్ల పాటు ఇలా చేయండి.
8.పడవ యోగా
ఈయోగా చేసేటప్పుడు మీ శరీరం ఓ పడవలా ఉంటుంది. ఇలా చేయాలంటే శరీరంలో సమతుల్యత కావాలి. నేలపై కూర్చోండి..మీ కాళ్లను నిఠారుగా ఉంచండి.మీ కాళ్లను ఎత్తండి..మీచేతిని నేలకు సమాంతరంగా చాపండి. దీంతో వీ ఆకారాన్ని ఏర్పాటు చేయండి.
9.స్టాండింగ్-ఫార్వర్డ్ బెండ్ భంగిమ(ఉత్తానాసనం)
హిప్ వెడల్పు దూరంలో మీరు మీ పాదాలతో ఉండాలి. తర్వాత కిందకు వంగి, మీ అరచేతులతో నేలను తాకండి, మీ మొహం మీ మోకాళ్లకు తాకేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
10. అప్‌వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్
ఈయోగా చేయడానికి మీరు మీ కడుపుపై పడుకోవాలి..అరచేతులు కిందికి అభిముఖంగా ఉంచి మీ చేతులను ముందుకు చాచి..వాటిని మీ భుజాల కింద ఉంచాలి.ఆ సమయంలో మీ శరీరాన్ని పైకి ఎత్తాలి..ముందుకు చూడాలి..భుజాలు మీ చెవులకు దూరంగా ఉండాలి. మీ మోకాళ్లు ఎత్తండి మీ పాదాలు చేతిని చాపలోకి నొక్కండి..ఇలా చేయడం వల్ల శరీర బరువును సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది.
Also read:Naga Chaitanya Dating: టాలీవుడ్ యువ హీరోయిన్‌తో నాగ చైతన్య డేటింగ్.. ఎవరో తెలిస్తే షాకే?
Also read:Swathi Sathish: నటి ప్రాణం మీదకు తెచ్చిన సర్జరీ..వైరల్‌గా మారిన ఫోటోలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook