అలోవెరా ( Aloe Vera ) వల్ల ఎన్ని లాభాలో మనందరికీ తెలుసు. అందుకే చాలా మంది ఎక్కువగా తీసుకుంటారు. దాంతో పాటు అలోవెరా మంచిది అని విపరీతమైన ప్రచారం వల్ల కూడా చాలా మంది లెక్కకు మించి తీసుకోవడం ప్రారంభించారు. నిజానికి ఏదైనా అతిగా తీసుకోవడం మంచిది కాదు. అలా తీసుకోవడం వల్ల దీంతో లాభాల సంగతి అటుంచితే ఆరోగ్యానికి ( Health ) నష్టం కలిగే అవకాశం ఉంది. షుగర్ పేషెంట్స్ అలోవెరా తీసుకోవడానికి ముందు వైద్యులను సంప్రదిస్తే మంచిది. దాంతో పాటు గర్భవతి మహిళలు అలొవెరా రసాన్ని తాగడం మంచిది కాదు. ఇలాంటి పలు సూచనలు మీకోసం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ALSO READ| Social Distancing: సోషల్ డిస్టెన్సింగ్..బంధాల మధ్య డిస్టెన్సింగ్ కాదు


కడుపునొప్పి 
అలోవెరాలో లెటేక్స్ అధికంగా ఉంటుంది. దీని వల్ల కొందిరికి అలెర్జీ వస్తుంది. దీంతో పాటు కడుపునొప్పి కూడా రావచ్చ.


స్కిన్ ఇరిటేషన్
ఇప్పటికే స్కిన్ అలెర్జీస్ ఉన్నవాళ్లు అలోవెరా జ్యూస్ తీసుకోవడం మానేస్తే మంచిది. ఎందుకంటే దీని వల్ల స్కిన్ అలెర్జీ పెరిగి, కళ్లు ఎర్రబడటం, రాషెస్ రావడం మొదలవుతుంది.


షుగర్ లెవల్ తగ్గిస్తుంది
వైద్యులను సంప్రదించకుండా అలొవెరా రసాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే దీని వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చెడిపోతుంది. 


ALSO READ|  Coronavirus in Kids: పిల్లలకు కరోనావైరస్...ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. పరిశోధకుల వెల్లడి



లీవర్ 
అలోవెరాలో ఉండే బయో ఆక్టివ్ అంశాల వల్ల లీవర్ పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే వైద్యులను సంప్రదించకుండా అలోవెరా వాడరాదు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR