Spinach Broccoli Milk Can Relief Stress Anxiety : ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి కారణంగా ఆందోళనకు గురవుతున్నారు. దీని కారణంగా తవ్ర అనారోగ్య సమస్యలైన రక్తపోటుతో పాటు, గుండెపోటు సమస్యల బారిన పడుతున్నారు. ఒత్తిడి అనేది అనేక సమస్యల కారణంగా వస్తోంది. కాబట్టి దీని నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే ఒత్తిడి కారణంగా ప్రాణాంతక సమస్యలు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు పలు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఆహారాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవే:
బచ్చలికూర:

పచ్చి ఆకు కూరలను ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ మెదడులో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు సహాయపడతాయి. దీంతో  హ్యాపీ హార్మోన్ విడుదవుతుంది. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆకు కూరలను తినడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. 


బ్రోకలీ:
బ్రోకలీ సలాడ్స్‌ ప్రతి రోజు డైట్‌లో తీసుకోవడం వల్ల అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానసిక సమస్యైన డిప్రెషన్ నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒత్తిడి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బ్రోకలీని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


అజ్వైన్:
ఆయుర్వేద శాస్త్రంలో అజ్వైన్ గురించి ప్రత్యేకంగా వివరించారు. ఇందులో చాచా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. దీంతో తీవ్ర పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  మానసిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అజ్వైన్ నీటిని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. 


పాలు:
పాలలో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. ఇందులో ప్రొటీన్ల పరిమాణాలు కూడా అధికంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పాలు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి