నేటి ఆధునిక సమాజంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య  మలబద్దకం. దీనికి ప్రధాన కారణం సరైన సమయంలో ఆహారం,  నీరు తీసుకోకపోవడంతో పాటు మారుతున్న జీవన విధానం కూడా. మలబద్దకమే కదా అని లైట్‌గా తీసుకుంటే మీరు అనేక సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.  ముఖ్యంగా జ్వరం, తలనొప్పి, హైపర్ టెంషన్స్, జీర్ణాశయ వ్యాధులు, పైల్స్ వంటి వాటి బారిన పడతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నివారణ చిట్కాలు:- 


* ద్రవ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. 


* పీచు పదార్ధాలు ఎక్కువగా తినాలి. ఆకుకూరలు, అరటి, జామ వంటి వాటిని ఎక్కువగా తినాలి.  


* పీచు పదార్థాలు అధికంగా ఉన్న అరటి పండ్లు, పైనాపిల్, బత్తాయి, సపోట పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని నిత్యం ఆహారపు అలవాట్లలో భాగంగా చేర్చుకోవడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.


* ఆయిల్ ఫుడ్స్, మసాలాలు, వేపుళ్లు మానేయాలి. టీ, కాఫీలు తక్కువగా తీసుకోవాలి. 


* నిల్వ ఉంచిన పచ్చళ్లు తినడం మానాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. 


* నీరు సరిపడినంతగా తాగాలి. రోజుకు కనీసం 3 నుంచి 5 లీటర్ల నీరు తీసుకోవాలి.


* రోజూ వ్యాయామం చేయడం వలన మలబద్దకం సమస్య రాదు. 


* మొలకెత్తిన గింజలు, నూనె లేకుండా చపాతి, జొన్న రొట్టెలు తీసుకోవడం కూడా చాలా మంచిదే. వారానికోసారైనా  సాయంత్రంపూట  గుగ్గిళ్లు వంటివి తీసుకోవాలి.