Turmeric Milk Benefits: మన భారతీయులు వంటకాల్లో ఎక్కువగా వినియోగించే వాటిలో పసుపు ఒకటి..ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలలో పసుపుకుని కలుపుకుని తాగడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పసుపు పాలు ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది:

పసుపు పాలు తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ పాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. అంతేకాకుండా గుండెపై కూడా మంచి ప్రభావాన్ని చూపి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


జలుబు, దగ్గు నుంచి ఉపశమనం:
పసుపు పాలలో యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ పాలను ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు శరీరం వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు జలుబు, దగ్గు, దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..


బ్లడ్‌లోని షుగర్‌ అదుపు ఉంచుతుంది:
మధుమేహంతో బాధపడేవారిలో రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతు..తగ్గుతూ ఉంటాయి. ఇలాంటివారు తప్పకుండా ప్రతిరోజు పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మధుమేహం ప్రాణాంతకంగా కూడా మారకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


జీర్ణక్రియ సమస్యలకు చెక్:
పసుపులో జీర్ణక్రియకు కావాల్సిన యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు పసుపును పాలలో కలుపుకొని తాగడం వల్ల జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పొట్టలో ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధులు కూడా దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter