Unhealthy Food for Liver: ఇవి తింటే కాలేయ వ్యాధులు తప్పవు.. వీటిని అస్సుల తినకండి..!
Unhealthy Food for Liver: అధికంగా ఆల్కహాల్, మాదకద్రవ్యాల వినియోగించడం వల్ల కాలేయ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా రోజూ తిసుకునే కొన్ని రకాల కలుషిత ఆహారం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Unhealthy Food for Liver: అధికంగా ఆల్కహాల్, మాదకద్రవ్యాల వినియోగించడం వల్ల కాలేయ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా రోజూ తిసుకునే కొన్ని రకాల కలుషిత ఆహారం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమస్యలు రాకుండా ఉండేందుకు పచ్చి కూరగాయలు, పండ్లు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలో తెలుసుకోండి..
చక్కెర పదార్థాలు:
చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మిఠాయి, సోడా వంటి స్వీట్‌లలో అధికంగా ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా కాలేయ వ్యాధులకు దారితీస్తుంది.
తెల్లని పిండి:
మైదాతో చేసిన వస్తువులు అధికంగా ప్రాసెస్ చేస్తారు. కావున ఇందులో ఖనిజాలు, ఫైబర్ అవసరమైన విటమిన్లు ఉండవు. కావున వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. పాస్తా, పిజ్జా, బిస్కెట్లు, బ్రెడ్ వంటి వాటిని తినడం మానుకోండి.
ఫాస్ట్ ఫుడ్:
ఫాస్ట్ ఫుడ్‌లో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. కావున వీటిని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, వేఫర్లు వంటి ఆహార పదార్థాలు కాలేయాన్ని పాడు చేస్తాయి. అంతేకాకుండా సంతృప్త కొవ్వు కాలేయంతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
రెడ్ మీట్:
రెడ్ మీట్ రకరకాల పోషకాలుంటాయి. కానీ వీటిని తినకపోవడం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని క్రమం తప్పకుండా తింటే.. జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Also Read: Tulsi Uses And Benefits: తులసి మొక్క తరుచుగా ఎండిపోతుందా.. అయితే ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook