Urad Dal For Diabetes: జీవన శైలి మారడం, జన్యుపరమైన కారణాలతో చాలా మంది మధుమేహం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిక్ పేషెంట్లు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు శీతాకాలంలో ప్రొటీన్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుని తీవ్ర మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ తీవ్ర డయాబెటిస్‌ నుంచి ఉపశమనం పొందడానికి మినప్పప్పు ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మినప్పప్పులో లభించే పోషకాలు:
మినప్పప్పులో ప్రోటీన్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో పొటాషియం, ఐరన్, ఫోలేట్, కాల్షియం అధిక మేతాదులో లభిస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ ఉన్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఉరద్ దాల్‌ల్లో ఉండే ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు శరీర పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.


మినప్పప్పు మధుమేహం ఉన్నవారికి ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చుతుంది:
మినప్పప్పు ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాలుగా లభిస్తోంది. ఒక రకం పొట్టు తీసిన పప్పైతే.. ఇకో రకం మనం తరచుగా వంటకాల్లో వినియోగించే పప్పు. అయితే పొట్టు లేకుండా పప్పును తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు తగ్గి డయాబెటిక్ నియంత్రణలో ఉంటుంది.


మినప్పప్పు వల్ల కలిగే ఇరత  ప్రయోజనాలు:
మినప్పప్పు  నూనె లేకుండా రోటీల్లో వినియోగిస్తే.. శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఇప్పుడు ఈ పప్పులో నూనె వేసి వండుతున్నారు. ఇలా వడడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలా తినకపోవడం చాలా మంచిది. మధుమేహ రోగులు నూనె లేకుండా మినప్పప్పు వండుకుని తింటే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.


Also Read: SBI Interest Rate Hike: ఎస్‌బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు 


Also Read: CM Nitish Kumar: సారా తాగితే చావడం ఖాయం.. కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook