Uric Acid Control: శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఇవే..
Uric Acid Control: శరీరంలోని యూరిక్ యాసిడ్ పరిమాణాలు పెరగడం కారణంగా చాలామందిలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అంది సమస్యలు వస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ క్రింది సాధారణ చిట్కాలను ప్రతిరోజు పాటించండి.
Uric Acid Control: ప్రస్తుతం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో యూరికి యాసిడ్ పేరుకుపోవడం కారణంగా కీళ్ల నొప్పులు, మూత్రపిండాల వ్యాధులు, గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యతో బాధపడేవారు తప్పకుండా శరీరం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని సహజమైన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
హైడ్రేటెడ్ గా ఉండండి:
యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు రోజంతా శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవడానికి తగిన మొత్తంలో నీటిని త్రాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతిరోజు 10 నుంచి 12 గ్లాసుల వరకు నీటిని తాగాల్సి ఉంటుంది.
ఫైబర్ రిచ్ ఫుడ్స్:
శరీరంలోని యూరిక్ యాసిడ్ పరిమాణాలు నియంత్రణలో ఉండడానికి ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి యూరిక్ యాసిడ్ నియంత్రించుకోవాలనుకునేవారు ప్రతిరోజు అరటిపండు, యాపిల్, ఓట్స్, మిల్లెట్ మొదలైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి:
శరీరంలోని యూరిక్ యాసిడ్ పరిమాణాలను నియంత్రించుకోవడానికి తప్పకుండా శరీర బరువును కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గడానికి ప్రతి రోజు వ్యాయామాలు చేయడమే కాకుండా డైట్ పద్ధతిలో ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
ఆకుకూరలు, గింజలు తినండి:
శరీరంలోని యూరిక్ యాసిడ్ పరిమాణాలు తగ్గడానికి ప్రతి రోజు ఆకుకూరలతో పాటు చిరుధాన్యాలను కూడా ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీలైతే ఆహారాలను బయట పద్ధతిలో తీసుకోవడం వల్ల శరీరంలోని ఎవరికి ఆసిడ్ పరిమా ణాలు నియంత్రణలో ఉంటాయి.
కాఫీ తాగండి:
అధిక పరిమాణంలో శరీరంలోని యూరిక్ యాసిడ్ పెరిగినవారు తప్పకుండా ప్రతిరోజు కాఫీని తాగాల్సి ఉంటుంది. ఇలా తాగడం వల్ల యూరిక్ యాసిడ్ పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.