Uric Acid control leaves: యూరిక్ యాసిడ్‌ అంటే మన రక్తంలో ఉండే వ్యర్థం. మన శరీరంలో ప్యూరిన్స్ కెమికల్స్‌ విడిపోయినప్పుడు యూరిక్ యాసిడ్‌ ఏర్పడుతుంది. చాలా వరకు యూరిక్ యాసిడ్‌ రక్తంలోనే కలిసిపోతుంది. మిగిలినవి కిడ్నీల ద్వారా యూరిన్ ద్వారా బయటకు వెళ్తుంది.  యూరిక్ యాసిడ్‌ కనిపించినప్పుడు హైపర్‌యూరికేమియా వస్తుంది. ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. యూరిక్ యాసిడ్‌ సమస్యకు కొన్ని మందులను వైద్యులు సూచిస్తారు. అయితే, ఆయుర్వేద పరంగా కొన్ని రకాల ఆకులు వినియోగిస్తారు. ఈ ఆకుల్లో థెరపిటిక్ గుణాలు ఉంటాయి. హై యూరిక్ యాసిడ్‌ను తగ్గించే ఆకులు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులసి ఆకులు..
తులసి చెట్టు అందరి ఇళ్లలో అందుబాటులో ఉంటాయి. తులసి ఆకుల్లో మెడిసినల్‌ గుణాలు ఉంటాయి. ఇది హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అంతేకాదు తులసి ఆకులు యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు యూరిక్ యాసిడ్‌ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తులసి ఆకులు డిటాక్సిఫై చేస్తాయి. యూరిక్ యాసిడ్‌ ను నివారిస్తుంది. తులసి ఆకులను తరచూ నమలడం వల్ల సీజనల్‌ వ్యాధులకు కూడా గురికాకుండా ఉంటారు.


వేప ఆకులు..
వేప ఆకుల్లో డిటాక్సిఫైంగ్‌ గుణాలు ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇవి శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించేస్తాయి. దీంతో యూరిక్ యాసిడ్‌ ను కూడా తరిమేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల యూరిక్ యాసిడ్‌ స్థాయిలను నివారిస్తాయి


గిలోయ్..
ఆయుర్వేదంలో గిలోయ్‌ ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇవి ఇమ్యూనిటీ బూస్టింగ్‌ ఇస్తాయి. అంతేకాదు యూరిక్ యాసిడ్‌ స్థాయిలను నిర్వహిస్తాయి. గిలోయ్ జాయింట్‌ పెయిన్, ఇన్ల్ఫమేషన్‌ తగ్గించడంలో గిలోయ్ కీలకపాత్ర పోషిస్తుంది.


ఇదీ చదవండి: ప్రతిరోజూ 2 అంజీర్‌ పండ్లను తింటే ఏమవుతుందో తెలుసా?


కొత్తిమీర..
ఆయుర్వేదంలో కొత్తిమీరను కూడా ఉపయోగిస్తారు. యూరిక్ యాసిడ్‌ స్థాయిలను తగ్గించడంలో కొత్తిమీర ఉపయోగపడుతుంది. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కొత్తిమీర మన శరీరంలో నుంచి విషపదార్థాలను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 


త్రిఫల..
త్రిఫలం ఆయుర్వేదంలో గత ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. త్రిఫలను బిభిటాకి, అమలకి, హరితాకి అనే మూడు పండ్లను ఉపయోగించి తయారు చేస్తారు. అంతేకాదు త్రిఫలలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు యూరిక్ యాసిడ్‌ స్థాయిలు తగ్గించడంలో సహాయపడతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


ఇదీ చదవండి:  బాతుగుడ్డు వారానికి ఒకటి తింటే మీ శరీరంలో జరిగే మార్పు ఏంటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి