Fig Health benefits: ప్రతిరోజూ 2 అంజీర్‌ పండ్లను తింటే ఏమవుతుందో తెలుసా?

Fig Health benefits: అంజీర్‌ పండ్లు వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల దీన్ని లాభాలు డబుల్ అవుతాయి.

Written by - Renuka Godugu | Last Updated : May 15, 2024, 03:43 PM IST
Fig Health benefits: ప్రతిరోజూ 2 అంజీర్‌ పండ్లను తింటే ఏమవుతుందో తెలుసా?

Fig Health benefits: అంజీర్‌ పండ్లు వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని రోజూ రాత్రి పడుకునే ముందు నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల దీన్ని లాభాలు డబుల్ అవుతాయి. అంజీర్‌ పండు ప్రతిరోజూ ఓ రెండు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

ఫైబర్ పుష్కలం..
అంజీర్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే కరగని ఫైబర్‌ రెండూ ఉంటాయి. అంజీర్‌ జీర్ణ ఆరోగ్యానికి మంచిది వీటిని మన డైట్లో చేర్చుకుని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య అనేది ఉండదు. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు సహాయపడుతుంది.

విటమిన్స్, మినరల్స్..
అంజీర్‌లో ఎన్నో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ కే, ఏ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉండటం వల్ల ఇవి మన శరీర పనితీరుకు ఎంతో ఆరోగ్యకరం.

గుండె ఆరోగ్యం..
అంజీర్‌ పండులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులోని ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి. ముఖ్యంగా అంజీర్‌లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా చెక్‌ పెడతాయి.

యాంటీ ఆక్సిడెంట్‌..
అంజీర్‌లో పాలీఫెనల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్‌ సమస్య రాకుండా మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు అంజీర్‌ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

ఇదీ చదవండి: శరీరంలో రక్త సరఫరాను పెంచే 6 ఆహారాలు ఇవే..

బరువు నిర్వహణ..
అంజీర్‌ పండులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన కడుపును ఎక్కువ సమయంపాటు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీంతో మనం క్యాలరీలు తక్కువగా తీసుకన్నట్లవుతుంది.

ఎముక ఆరోగ్యం..
అంజీర్‌లో కాల్షియం, మెగ్నిషీయం, ఫాస్పరస్‌ అధిక మోతాదులో ఉంటుంది. ఇది మన ఎముక ఆరోగ్యానికి మంచిది. ఆస్టియోపోరోసిస్‌ రాకుండా మన ఎముకలను అంజీర్‌ పండు కాపాడుతుంది. అంజీర్‌ పండ్లను మీ పిల్లలకు కూడా ఇవ్వండి వారి ఎముకలు దృఢంగా మారతాయి.

ఇదీ చదవండి:  కడుపులో గ్యాస్ పెయిన్ భరించలేకపోతున్నారా? ఈ డ్రింక్ తాగితే వెంటనే ఉపశమనం..

బ్లడ్‌ షుగర్‌..
డయాబెటిస్ ఉన్నవారికి తీయగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో అంజీర్‌ పండును తినవచ్చు. ఈ పండు రుచి తింటే తీయగా ఉంటుంది. కానీ, మన రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచవు. డయాబెటిస్‌ వారు కూడా ఈ పండును డాక్టర్‌ సలహా మేరకు తీసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News