Vegetable Soups For Weight Loss: శరీరం అరోగ్యంగా ఉండడానికి చాలా మంది  వెజిటబుల్ సూప్ ఉదయం పూట అల్పాహరంలో భాగంగా తీసుకుంటున్నారు. అయితే ఈ సూప్‌ వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడానికి కూడా ఈ సూప్‌ను కూడా తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సూప్‌ను క్రమం తప్పకుండా తాగితే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. అయితే  బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ వెజిటబుల్ సూప్ తాగితే సులభంగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా శరీర దృఢంగా కూడా తయరవుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టు కొవ్వు, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు ఈ సూప్‌ని తాగొచ్చు. అయితే దీనిని తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గాలంటే ఈ వెజిటబుల్ సూప్స్ తాగండి:


కాలీఫ్లవర్ సూప్:
క్యాలీఫ్లవర్ సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే దీనిని తయారు చేయడానికి ముందుగా బాణలిలో కొద్దిగా నూనె తీసుకుని..నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కాలీఫ్లవర్ ముక్కలు వేసి లైట్ గా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో సూప్‌కు తగినంత నీరుని వేసి ఉడికించాలి.  ఉడికిన తర్వాత అందులో ఉప్పు, కారం వేసి..సూప్ చల్లారాక మిక్సీలో లైట్ గా బ్లెండ్ చేసి సర్వ్‌ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన సూప్‌ను ఉదయం పూట తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు.


బీట్‌రూట్ సూప్:
బీట్‌రూట్‌లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అయితే వీటిని సూప్‌లా చేసుకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరిగి శరీరంలోని బలహీనత తొలగిపోతుంది. దీనిని తయారు చేయడానికి ముందుగా కుక్కర్‌లో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, టమోటో, బీట్‌రూట్ వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత రెండు మూతలు నీళ్లు పోసి ఇప్పుడు ఒక విజిల్ వచ్చే దాకా ఉడికించాలి. అయితే ఉడికించినది చల్లారిత తర్వాత గ్రైండ్‌ చేయాలి. ఆ తర్వాత ఈ సూప్‌ను తాగొచ్చు.
 
పోరకాయ సూప్‌:
పోరకాయ సూప్ తాగడానికి చాలా రుచిగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తాగేందుకు ఇష్టపడతారు. అయితే దీనిని తయారు చేయడానికి ముందుగా కడాయిలో నూనె వేసి ఉల్లిపాయలు, టమోటాలు వేయించాలి. ఆ తరవాత అందులో తరిగిన పోరకాయ ముక్కలను వేసి నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. ఇలా చేసిన తర్వాత ఉప్పు వేసి గ్రైండ్‌ చేయాలి. ఇలా చేసిన తర్వాత సర్వ్‌ చేసుకోవాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read : Komati Reddy Venkat Reddy: కోమటి రెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం


Also Read : Dasoju Sravan: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ గూటికి దాసోజు శ్రవణ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook