Komati Reddy Venkat Reddy: బిగ్ బ్రేకింగ్.. కోమటిరెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం

Komatireddy Venkat Reddy Audio Leak: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ కలకలం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు మునుగోడుతో పాటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయ్యాలంటూ చెప్పిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఏమైనా ఉంటే తాను చూసుకుంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో కోమటి రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలని కోరడం ఎంతవరకు సమంజసం అంటూ కోమటిరెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 04:39 PM IST
  • మునుగోడు ఎన్నికల వేళ కోమటిరెడ్డి వైరల్
  • కాంగ్రెస్ నేతలకు ఫోన్
  • తన తమ్ముడికి ఓటేయ్యాలంటూ రిక్వెస్ట్
Komati Reddy Venkat Reddy: బిగ్ బ్రేకింగ్.. కోమటిరెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం

Komatireddy Venkat Reddy Audio Leak: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ కలకలం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు మునుగోడుతో పాటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఓటేయ్యాలంటూ చెప్పిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఏమైనా ఉంటే తాను చూసుకుంటూ చెప్పడం సంచలనంగా మారింది. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నికల్లో జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో కోమటి రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలని కోరడం ఎంతవరకు సమంజసం అంటూ కోమటిరెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. 

పార్టీలకు అతీతంగా సాయం చేయాలని కోమటిరెడ్డి కోరినట్లు ఆడియోలో ఉంది. మీరంతా తన ఫ్యామిలీ మెంబర్స్ అని.. పార్టీ అది ఇది చూడకండని చెప్పారు. ఈ దెబ్బతో వాడు ఓడిపోతే.. పీసీసీ తాను అవుతానని అన్నారు. తెలంగాణ అంతా పాదయాత్ర చేస్తానన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ ఆడియో కాంగ్రెస్‌కు పెద్ద మైనస్‌గా మారే అవకాశం ఉంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ఓ వైపు అటు ఇటు చేరికలతో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇబ్బంది పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవాల్సి పోయి.. అంతర్గత కలహాలతో భారీగా నష్టపోతోంది. ముఖ్యంగా పార్టీలోని సీనియర్ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సుముఖంగా లేరు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పారు. తాజాగా కోమటిరెడ్డి ఆడియో లీక్‌తో కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. 

కోమటిరెడ్డి ఆడియోపై హైకమాండ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఆడియో క్లిప్ పై ఏఐసీసీ కార్యదర్శులు ఆరా తీస్తున్నారు. వెంకటరెడ్డిపై కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ ఠాకూర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News