విటమిన్ బి 12 శరీరానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. శరీరంలో విటమిన్ బి 12 లోపముంటే..మెదడుకు, శరీరానికి రెండింటికీ నష్టం కలుగుతుంది. మరి ఈ విటమిన్ లోపముంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో నెర్వస్ సిస్టమ్‌ను సరి చేసేందుకు విటమిన్ బి 12 చాలా అవసరం. శరీరంలో రెడ్ బ్లడ్‌సెల్స్ కూడా దీనివల్లనే అభివృద్ధి చెందుతాయి. శరీరంలో విటమిన్ లోపముంటే ఎముకల వ్యాధి తలెత్తుతుంది. అంతేకాకుండా ఎనీమియాకు కారణం కాగలదు. ఈ ఆహారం ద్వారా విటమిన్ డి లోపం పూర్తి చేసుకోవచ్చు.


ఓట్స్, సోయాబీన్ చాలా అవసరం


ఇటీవలి కాలంలో ఓట్స్ వినియోగం చాలా ఎక్కువౌతుంది. దీని ద్వారా విటమిన్ బి 12 లోపం పూర్తి చేయవచ్చు. ఇది కాకుండా సోయాబీన్‌ను కూడా డైట్‌లో భాగం చేసుకోవాలి. సోయాబీన్‌ను పలావు, కూరలు, శాండ్‌విచ్‌లో వినియోగిస్తే రుచి పెరుగుతుంది. సోయాబీన్‌లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది.


మష్రూమ్ బ్రోకలీ


విటమిన్ బి 12 లోపాన్ని సరిచేసేందుకు మష్రూమ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ బి 12 అధికంగా ఉంటుంది. ఇది కాకుండా కాల్షియం, ప్రోటీన్స్, ఐరన్ కూడా అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ వల్ల శరీరానికి పోషకాలు లభిస్తాయి. అదే విధంగా బ్రోకలీ కూడా విటమిన్ బి 12 కు మంచి ప్రత్యామ్నాయం. శరీరంలో హిమోగ్లోబిన్ లోపమున్నా తొలగిపోతుంది. 


పాల ఉత్పత్తులైన పాలు, పెరుగు, పన్నీర్‌లో విటమిన్ బి 12 పుష్కలంగా ఉంటుంది. పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి 12 ఉంటాయి. లోఫ్యాట్ పెరుగు తీసుకోవడం ద్వారా కూడా విటమిన్ బి 12 లోపం పూర్తి చేయవచ్చు.


Also read: Breathing problem: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోందా, అయితే ఈ పదార్ధాలకు దూరంగా ఉండండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook