Vitamin Deficiency: ఆ ఒక్క విటమిన్ లోపిస్తే మీ బాడీ మొత్తం గుల్లయిపోతుంది జాగ్రత్త
Vitamin Deficiency: మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలకు చాలా రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. ఇందులో విటమిన్ల పాత్ర అత్యంత కీలకం. ఒక్కొక్క విటమిన్ ఉపయోగం ఒక్కో రకంగా ఉంటుంది. అందుకే కొన్ని విటమిన్లు లోపిస్తే శరీరం లోపల్నించి పూర్తిగా గుల్లయిపోతుంది. అందుకే విటమిన్ లోపం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
Vitamin Deficiency: మనిషి ఆరోగ్యంలో విటమిన్లు కీలకమైన భూమిక వహిస్తుంటాయి. శరీరంలోని వివిధ అంగాల పనితీరు, ఎదుగుదల, పటిష్టంగా ఉండేందుకు విటమన్ల అవసరం చాలా ఉంటుంది.ముఖ్యంగా ఒక విటమిన్ లోపిస్తే శరీరం అంతర్గతంగా పూర్తిగా గుల్లగా మారిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలి.
శరీరంలో వివిధ రకాల పనులకు వేర్వేరు విటమిన్లు ఉపయోగపడుతుంటాయి. కొన్ని విటమిన్లు వివిధ రకాల వ్యాధుల్నించి పోరాడే సామర్ధ్యం అందిస్తే, మరి కొన్ని ఎముకల్ని పటిష్టంగా ఉంచుతుంటాయి. ఇంకొన్ని విటమిన్లు చర్మం, కేశ సంరక్షణకు ఉపయోగపడతాయి. అయితే విటమిన్ బి12 విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విటమిన్ లోపిస్తే శరీరంలో పూర్తిగా గుల్లయిపోతుందని చాలామందికి తెలియదు. విటమిన్ బి12 ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. శరీరంలో వివిధ పనుల్లో ఉపయోగపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం, మెటబోలిజం, డీఎన్ఏ సింథసిస్ వంటి కీలకమైన పనులకు విటమిన్ బి12 దోహదపడుతుంది. అందుకే విటమిన్ బి12 లోపాన్ని ఓ సీరియస్ సమస్యగానే పరిగణించాలి. చాలామంది ఈ విషయాన్ని తెలియక అశ్రద్ధ చేస్తుంటారు.
విటమిన్ బి 12 లోపిస్తే కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విటమిన్ లోపముంటే ప్రధానంగా అలసట, బలహీనత ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడంతో అలసట వస్తుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తవచ్చు. కాళ్లు, చేతుల్లో తిమ్మిరి ఉండటం, నొప్పి ఉండటం గమనించవచ్చు. దీనికితోడు డిప్రెషన్, ఆందోళన, జ్ఞాపకశక్తి తగ్గడం కూడా గమనించవచ్చు. విరేచనాలు, మలబద్ధకం, ఆకలి తగ్గడం మరో మూడు ప్రధాన లక్షణాలు. నాలుకపై గాయం, నోటి పూత, నోట్లో స్వెల్లింగ్ కూడా ఉంటుంది. చర్మం పుసుపుగా మారవచ్చు.
జీర్ణ సంబంధిత సమస్యల కారణంగా విటమిన్ బి12 లోపం తలెత్తవచ్చు. సీలియెక్ వ్యాధి ఉంటే శరీరంలో విటమిన్ బి12 సంగ్రహణ తగ్గిపోతుంది. వయస్సుతో పాటు విటమిన్ బి12 సంగ్రహణ కూడా తగ్గుతుంది. కొన్ని మందులు కూడా ఇందుకు కారణం కావచ్చు. అందుకే విటమిన్ బి12 లోపం తలెత్తినా లేక లోపం తలెత్తకుండా ఉండాలంటే మాంసం, చేపలు, గుడ్లు, పాలు కాస్త తరచూ డైట్ లో ఉండేట్టు చూసుకోవాలి. శాకాహారులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. మష్రూం, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. లేదా విటమిన్ బి12 సప్లిమెంట్స్ తీసుకోవాలి. వాస్తవానికి విటమిన్ బి12 లోపం అనేది సీరియస్ సమస్యే అయినా చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు.
Also read: Most Expensive Water Bottle: ఆ వాటర్ బాటిల్ ఖరీదు 50 లక్షలు, ఎందుకంత ఖరీదో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook