Vitamin B12: విటమిన్ బి12 లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్యను ఎదుర్కొవడానికి విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మారుతున్న జీవన శైలి కారణంగానే ఈ విటమిన్‌ లోపాలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి విటమిన్ బి12 లోపం వల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. దానిని నివారించే మార్గాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చర్మం పసుపు రంగులోకి రావడం:


చర్మం పసుపు రంగులోకి మారితే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.


తలనొప్పి:


క్రమం తప్పకుండా తల నొప్పి వస్తే అది విటమిన్ B12 లోపమేనని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.


కడుపు సమస్యలు:


విటమిన్ B12 లోపం వల్ల కొన్నిసార్లు కడుపు సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. విరేచనాలు, మలబద్ధకం, అపానవాయువు, కడుపులో గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


తల తిరగడం:


అంతే కాకుండా పదే పదే తలతిరుగుతున్నట్లు అనిపిస్తే కూడా జాగ్రత్తగా ఉండాలి. వాస్తవానికి ఇది విటమిన్ల లోపం కారణంగానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Pitradosh: పితృ దోషం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా..!


Also Read: Milk Benefits At Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మర్చిపోకండి..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook