Pitradosh: ప్రతి మనిషికీ తన జీవితంలో డబ్బు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు. డబ్బు సంపాదించే క్రమంలో ఎలాంటి ఆటంకాలు ఉండకుండా జీవితం మొత్తం సాఫీగా సాగేలా కలలు కంటుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో వివిధ రకాల అడ్డంకులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే హిందూ మతం ప్రకారం..పూర్వీకుల కర్మ మనపై ప్రభావం చూపుతుందని.. వీటి వల్లే కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని శాస్త్రం తెలిపింది. పూర్వీకులను సంతోషంగా ఉంచితేనే..ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు పెరుగుతాయని శాస్త్రం పేర్కొంది.
పూర్వీకులను సంతోషంగా ఉంచేందుకు అమావాస్య రోజున పూజించడం మంచిదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పేదలకు విరాళాలు ఇవ్వాలని శాస్త్రం చెబోతోంది. ఇలా చేయడం వల్ల వ్యాపార సంబంధిత సమస్య దూరమవుతాయని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా.. ఉద్యోగం లేదా విద్యా రంగంలో విజయం సాధిస్తారు.
పూర్వీకులు సంతోషంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు:
పూర్వీకులు సంతోషంగా ఉండాలంటే.. వారికీ పూజలు, శ్రాద్ధ కర్మలు చేయాలి. ముఖ్యంగా అమావాస్య రోజున పూజలు, దానం చేయడం వల్ల పితృులు సంతోషిస్తారు. అమావాస్యతో పాటు ఏ రోజునైనా కర్మలను చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత ఆ నీళ్లలో నల్ల నువ్వులు, అక్షింత వేసి పితృదేవతలకు అర్ఘ్యం సమర్పించాలి. కర్మ పూజల సమయంలో.. పూర్వీకులు ఇష్టపడే ఆహారాన్ని తయారు చేసి.. అందులో పండ్లు, కాయలు, స్వీట్లను ఉంచి.. ఆలయానికి వెళ్లి ప్రసాదంగా పంపిణీ చేయాలని శాస్త్రం తెలుపుతుంది. దీనితో పాటు పేదలకు దానం చేస్తే.. ప్రశాంతత లభించి పూర్వీకులు ప్రసన్నులవుతారని హిందూ సాంప్రదాయం పేర్కొంది.
Also Read: Weight Loss: బరువు తగ్గలనుకుంటున్నారా.. రోజూ ఇలా యోగా చేయడి..!
Also Read: Health Tips: కిచెన్ హెర్బ్స్.. ఈ ఐదింటితో అధిక బరువుకు చెక్.. సహజంగా బరువు తగ్గేయొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook