Vitamin C Rich Foods: విటమిన్ సి పోషకాలకు పవర్ హౌస్. సాధారణంగా నిమ్మకాయ, ఆరెంజ్ లోనే విటమిన్ సి ఉంటుందని అనుకుంటారు. అయితే విటమిన్ సి ఉండే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అందులోనే ఒక ఏడు ఆహారాల గురించి తెలుసుకుందాం. విటమిన్ సి ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి దీంతో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. విటమిన్ సి డైట్ లో ఉండడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. సీజనల్ జబ్బులు రాకుండా విటమిన్ సి కాపాడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్లో క్యాప్సికం...
ఎల్లో క్యాప్సికంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని డైట్ లో చేర్చుకోవాలి, ఫ్రై రూపంలో తీసుకోవచ్చు సూప్‌ కూడా తయారు చేసుకుంటారు. ఎల్లో, రెడ్ క్యాప్సికం కలిపి రెసిపీ తయారు చేసుకుంటారు. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఎల్లో పెప్పర్‌లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.


జామ..
జామకాయలు కూడా విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది, జామకాయలను నేరుగా తినవచ్చు. దీన్ని స్మూథీ రూపంలో కూడా తీసుకోవచ్చు. జామకాయలో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీ స్థాయిలను పెంచుతుంది.


స్ట్రాబెర్రీలు..
స్ట్రాబెర్రీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు ఇందులో విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది... ఎరుపు రంగులో ఉండే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. విటమిన్ 'సి' కలిగిన ఈ పండు యోగార్ట్‌తో పాటు తీసుకోవచ్చు, స్మూతీ రూపంలో కూడా తయారు చేసుకుంటారు.


నెట్టింటా రచ్చరేపుతోన్న తమన్నా ఆలివ్ గౌన్.. మిల్కీ బ్యూటీ ట్రెండీ లేటెస్ట్ లుక్ వైరల్..


బొప్పాయి..
బొప్పాయిలో కూడా విటమిన్ 'సి' పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఈ పండును సలాడ్ రూపంలో లేదా స్మూథీ రూపంలో తీసుకోవచ్చు...సీ విటమిన్ శరీరంలో తక్కువ అయితే బొప్పాయి సులభంగా తీసుకోవచ్చు.


కివి..
కివి పండు లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. అయితే కివి పండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని నేరుగా తినవచ్చు లేదా స్నాక్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.


ఇదీ చదవండి: జూనియర్‌ హిట్‌మ్యాన్‌ వచ్చేశాడు.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్‌ వైఫ్‌ రితిక సజ్దే..  


బ్రోకోలి..
బ్రోకోలీలో విటమిన్ సి ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ కూడా ఉండటం వల్ల కంటే ఆరోగ్యానికి మంచిది. బ్రోకోలీల యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కూడా ఉంటుంది. బ్రోకోలిని డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ 'సి' అందుతుంది.ఇవి కాకుండా ఆరెంజ్, నిమ్మకాయ తీసుకోవడం వల్ల కూడా విటమిన్ సి వీటిని ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఎక్కువ శాతం మంది ఉపయోగించే ఆహారాలు ఇవే. విటమిన్ సి ఉండే ఈ ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి