Vitamin D: శరీరానికి కావల్సిన విటమిన్లలో అతి ముఖ్యమైంది విటమిన్ డి. ఎండతోనే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్ధాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విటమిన్ డి అనేది మనిషి శరీరానికి చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్ డి పాత్ర కీలకం. అయితే విటమిన్ డి అనేది కేవలం ఎండలోనే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్ధాల్లో కూడా పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి అనేది శరీరానికి అవసరమైన కీలకమైన పోషక పదార్ధం. విటమిన్ డి లోపంతో చాలా నష్టం జరుగుతుంది. 


అధిక రక్తపోటు, క్రానిక్ పెయిన్స్


విటమిన్ డి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధికంగా ఉండే రక్తపోటును విటమిన్ డి నియంత్రిస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోతేనే గుండెపోటు సమస్యలు వస్తాయి. ఇక మనిషి శీరరంలో విటమిన్ డి లోపిస్తే క్రానిక్ పెయిన్స్ వస్తాయి. చాలా సందర్భంగాల్లో ఈ నొప్పిని తట్టుకోలేం కూడా. 


బలహీనంగా మాంసకృతులు, అలసట


విటమిన్ డి లోపం కారణంగా మజిల్స్ బలహీనంగా ఉంటాయి.దీవల్ల బరువైన పనులు చేయలేరు. ఇబ్బందులు ఎదురౌతాయి. ఆఫీసు లేదా బయటి పనుల్తో త్వరగా అలసటకు లోనవుతారు. లేదా సమయం లేకుండా నిద్రపోతుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పట్టడమనేది విటమిన్ డి లోపం. 


డిప్రెషన్, సంయమనం లోపించడం


డిప్రెషన్ అనేది సాధారణంగా సామాజిక, ఆర్ధిక కారణాలతో వస్తుంది కానీ విటమిన్ డి లోపం వల్ల కూడా డిప్రెషన్ ఏర్పడుతుంది. విటమిన్ డి లోపం కారణంగా సంయమనం అస్సలుండదు. చాలా సందర్భాల్లో మూడ్ నార్మల్‌గా లేకపోవడానికి కారణం కూడా విటమిన్ డి లోపం. కొన్నిరకాల ఆహార పదార్ధాలతో విటమిన్ డి లోపం సరిచేసుకోవచ్చు.


విటమిన్ డి లభించే ఆహార పదార్ధాలివే


చేపలు, చేపల గుడ్లు, మష్రూమ్, పాలు, ధాన్యం, కోడి గుడ్లు, వెన్నలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. 


Also read: Almonds Side Effects: బాదంను అతిగా తింటున్నారా.. ఈ 5 రకాల అనారోగ్య సమస్యలు తప్పవు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Linkhttps://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.