Vitamin E Foods For Skin Whitening: చ‌ర్మంగా అందంగా క‌న‌బ‌డాల‌నుకునే వారు రోజూ విట‌మిన్ ఇ ఉండే ప‌దార్థాల‌ను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం అందంగా, ఆరోగ్యంగా త‌యార‌వుతుంది. చ‌ర్మ అందాన్ని మెరుగుప‌రిచే విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చి ఆకు కూరల్లో పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్‌ ఇ అధికంగా ఉండే ఆహారాల్లో బచ్చలికూర ఒకటి. ఇందులో ఎక్కువ విటమిన్‌ ఇ, ఎ, సి, కె ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనలు ఉన్నాయి. చర్మ ఎల్లప్పుడు తేమగా ఉండేలా సహాయపడుతుంది. 


చ‌ర్మం ఆరోగ్యంగా ఉండాల‌నుకునే వారు బాదంప‌ప్పును కూడా ఆహారంగా తీసుకోవాలి.  బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడిక‌ల్స్ కార‌ణంగా చ‌ర్మాని రక్షిస్తుంది. 


బ్రోక‌లీలో కూడా విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల  చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. 


పొద్దుతిరుగుడు గింజ‌లను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు రాకుండా కాపాడుతుంది.


ఈ విధంగా విట‌మిన్ ఇ ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న చ‌ర్మాన్ని స‌హ‌జంగా అందంగా, కాంతివంతంగా మార్చుకోవ‌చ్చ‌ని చర్మ నిపుణులు చెబుతున్నారు.


Also read: Vitamin D: విటమిన్ డి ఎక్కువైతే ఏమౌతుంది, ఎలాంటి అనారోగ్య సమస్యలెదురౌతాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook