Walnuts Health Benefits: మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో బాడీకి అవసరమైన డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన వివరాల ప్రకారం.. మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా వాల్నట్స్ని తీసుకోవాలంటున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా దృఢంగా ఉంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు:
చర్మ సమస్యలు:

కాలం మారుతున్న కొద్ది చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం వల్ల కానీ.. ఇతర ఆహార అలవాట్ల వల్ల కానీ ఈ చర్మ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలు ఉన్నవారు వాల్‌ నట్స్‌ని నీటిలో నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే.. అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
నానబెట్టిన వాల్ నట్స్ లో అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణ క్రియ శక్తిని పెంచడమే కాకుండా వ్యాధులు రాకుండా శరీరాన్ని సంరక్షిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఐరన్, పొటాషియం, జింక్, కాల్షియం వంటి మూలకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని నీటిలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం తీసుకుంటే బరువు తగ్గడమే కాకుండా కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయి.


జుట్టు సమస్యలకు చెక్:
వాల్ నట్స్ లో ఉండే మూలకాలు చర్మాన్ని ఆరోగ్యంగా చేయడమే కాకుండా జుట్టు సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుంచి బలంగా చేసేందుకు సహాయపడతాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ నట్స్ ను తీసుకోవాలి.


ఎముకలు దృఢంగా మారుతాయి:
వాల్ నట్స్ లో కాల్షియం, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. అయితే వీటిని క్రమం తప్పకుండా ఉదయం పూట తీసుకోవడం వల్ల ఎముకల సమస్యల నుంచి ఉపశమనం కలిగించి.. వాటిని దృఢపరిచేందుకు సహాయపడతాయి. కాబట్టి ఎముకల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్ ను తీసుకోవాలి.


Also Read: Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.


Also Read: Dussehra 2022 Date: దసరా రోజూ చేయాల్సి కార్యక్రమాలు ఇవే.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి