Warm breakfast in the morning:ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కొంతమందికి చల్లని పదార్థాలు తీసుకునే అలవాటు ఉంటుంది. వేడి వేడి అల్పహారానికి బదులు చల్లని గడ్డ పెరుగు లేదా రాత్రి మిగిలిపోయిన అన్నం లాంటివి తీసుకుంటుంటారు. అయితే ఆయుర్వేదం ప్రకారం బ్రేక్‌ఫాస్ట్‌కు చల్లటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఉత్తేజితంఅవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి వివరణ ఉందో ఒకసారి పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'రోజంతా మనిషి యాక్టివ్‌గా ఉండాలంటే అతని శరీర జీర్ణక్రియ చురుగ్గా పనిచేయాలి. ఇందుకోసం అల్పాహారం అనేది చాలా ముఖ్యం. ఆ అల్పాహారం మనం ఆరోజులో తీసుకునే భోజనం మొత్తాన్ని జీర్ణం చేసుకునేలా పేగులను సిద్ధం చేయాలి. ఇందుకోసం తేలికైన, వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.' అని ఆయుర్వేద నిపుణురాలు దీక్ష భవ్సర్ తెలిపారు.


ఒకరకంగా వేడి అల్పాహారమనేది వార్మ్అప్ ఎక్సర్‌సైజ్ లాంటిది. శరీరాన్ని తగినంత వేడిగా ఉంచుతుంది. మధ్యాహ్నం లంచ్‌కి జీర్ణక్రియను సిద్ధం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మధ్యాహ్నం 12గం. నుంచి 2గం. మధ్యలో భోజనం తీసుకోవాలి. ఆ సమయంలో సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తుంటాడు. ఉదయాన్నే వేడి అల్పాహారం జీర్ణక్రియను ఉత్తేజితం చేసి మధ్యాహ్నం బిగ్ మీల్‌ను సులువుగా ఆరగించుకునేందుకు దోహదపడుతుంది.


ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లో చల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతమాత్రం మంచిది కాదు. ఒకరకంగా అది మండుతున్న మంటపై నీళ్లు చల్లడం లాంటిదే. కాబట్టి చల్లని ఆహార పదార్థాలు (Breakfast) కాకుండా వేడి వేడిగా ఉన్న ఉడికించిన చిక్కుళ్లు, ఉడికించిన పల్లీలు, వెజిటేబుల్ సూప్, పండ్లు తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also Read: 5G services in Hyderabad: భారత్‌లోని 13 నగరాల్లో 5జీ సేవలు.. త్వరలోనే హైదరాబాద్‌కు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి