బ్రేక్​ఫాస్ట్​లో 'చచ్చిన పాముపిల్ల'...56 మంది విద్యార్థులకు అస్వస్థత

Karnataka: బ్రేక్​ఫాస్ట్ తిని..56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2021, 06:14 PM IST
బ్రేక్​ఫాస్ట్​లో 'చచ్చిన పాముపిల్ల'...56 మంది విద్యార్థులకు అస్వస్థత

Karnataka: కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో దారుణం జరిగింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 56 మంది విద్యార్థులు(Students) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం..బ్రేక్​ఫాస్ట్​లో చచ్చిన పాముపిల్ల(snakelet) ఉండటం. 

వివరాల్లోకి వెళితే...
కర్ణాటకలోని యాదగిరి జిల్లా(Yadgir district)​ అబ్బేతుమ్కుర్(​Abbetumkur village)లోని విశ్వారాధ్య విద్యావర్ధక రెసిడెన్షియల్ స్కూల్(​Vishwaradhya Vidyavardhaka Residential School)లో విద్యార్థులకు ఉదయం బ్రేక్​ఫాస్ట్​(breakfast)గా ఉప్మా(upma) పెట్టారు. వారికి పెట్టిన అల్పాహారంలో స్టూడెంట్స్ చచ్చిన పాముపిల్లను గుర్తించారు. వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ అప్పటికే చాలా మంది ఆ ఆహారం తీసుకోవడం వల్ల అస్వస్థత(illness)కు గురయ్యారు. 

Also Read: మహారాష్ట్రలో 14 ఏళ్ల గిరిజన బాలిక పై అత్యాచారం.. నిందితుడు అరెస్టు

విద్యార్థుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. విద్యార్థుల్ని స్థానిక ఎమ్మెల్యే వెంకటరెడ్డి, జిల్లా ఎస్​పీ వెండమూర్తి పరామర్శించారు. పిల్లల ఆరోగ్య స్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులంతా ఎనిమిది, తొమ్మిది తరగతులకు చెందినవారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News