Watermelon Benefits: పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?
Watermelon Benefits: వేసవిలో అందరికి ఇష్టమైనది పుచ్చకాయ. దీన్ని ఇష్టంగా చాలామంది తింటుంటారు. అయితే దీన్ని తినడం వల్ల శరీరాన్ని ఎండల నుంచి రక్షించడం సహా శరీరానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
Watermelon Benefits: ఈ ఏడాది ఎండలు మండిపోతాయని ఇటీవలే వాతావరణ శాఖ ఓ కీలక ప్రకటనలో వెల్లడించింది. మార్చి మొదటి వారం నుంచే వడగాలులు వీచడం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు నిత్యం మంచినీరు లేదా పండ్ల రసాలను తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ నీటి శాతం ఉన్న పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో నీటి స్థాయి క్రమబద్ధీకరిస్తుంది. అయితే పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్ నుంచి విముక్తి
వేసవిలో అతిపెద్ద సమస్య డీహైడ్రేషన్. శరీరంలో నీటి కొరత కారణంగా డీహైడ్రేషన్ కు దారి తీయవచ్చు. శరీరంలో నీరు శాతం తగ్గడం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. దాని నుంచి విముక్తి పడేందుకు నీటిని పుష్కలంగా తాగడం లేదా పండ్ల రసాలు, పుచ్చకాయలను తినాలి. పుచ్చకాయలో 92 శాతం నీరు కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి బయటపడవచ్చు.
పుచ్చకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి1, విటమిన్ బి-5, విటమిన్ బి6, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి. పుచ్చకాయ తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. అందులోని నీరు, పీచు పదార్థం పొట్టలో నిండిపోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. దీంతో ఆహారాన్ని తినకుండా నియంత్రించుకోవచ్చు.
వేసవిలో మనలో చాలామంది వడదెబ్బ బారిన పడుతుంటారు. అయితే పుచ్చకాయ తినడం వల్ల వడదెబ్బ నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరం బయటి వేడిని తట్టుకోవడానికి సహకరిస్తాయి. దీంతో పాటు మెరుగైన జీర్ణక్రియ కోసం పుచ్చకాయ ఎంతో సహకరిస్తుంది.
Also Read: Heart Attack Risk: రోజూ సరిగా బ్రష్ చేసుకోకపోతే గుండె జబ్బులు రావడం ఖాయం!
Also Read: Summer Drinks: మండుటెండల నుంచి రక్షణ పొందేందుకు ఈ పానీయాలు తాగండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.