Weekly Fitness Routine: ఆదివారం అంటే భారత్‌లో సెలవు దినంగా పరిగణిస్తారు. అయితే చాలా కంపెనీలు ఉద్యోగస్తులకు సెలవును ప్రకటిస్తారు. అయితే చాలా మంది ఆ రోజూ  ఫిట్‌నెస్ కోసం కూడా కేటాయిస్తారు. శరీరం ఫిట్‌నెస్‌గా ఉండడం చాలా ముఖ్యం లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం.. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కోసం తప్పకుండా యోగా కూడా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కావున ప్రతి రోజూ  వ్యాయామాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఫిట్‌ నెస్‌ కోసం రోజూ వ్యాయామాలు చేయలేకపోతే.. వారానికి ఒక రోజూ చేయోచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీక్లీ డైట్, వర్కవుట్ ప్లాన్ ఇలా చేసుకోవాలి:


1. ఒక వారం పాటు ఇలా డైట్ ప్లాన్ చేసుకోండి:
ప్రతిరోజు చాలా మంది ఉద్యోగాల కారణంగా హడావుడిగా ఉంటారు.  అయితే ప్రతి ఆదివారం రోజున సోమవారం నుంచి శనివారం దాకా ఏం  భోజనం, అల్పాహారం తీసుకోవాలో అది చార్ట్ సిద్ధం చేసుకోవాలి. అయితే ఈ డైట్‌కు సంబంధించిన అన్ని రకాల వస్తువులను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా వీటిలో కేవలం ఆరోగ్యమైన ఫుడ్‌ను మాత్రమే తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ఈ డైట్‌ అనుసరించాలని నిపుణులు తెలుపుతున్నారు.


2. ఇలా వ్యాయామం చేయండి:
ఆదివారం రోజున వర్క్ అవుట్స్‌ చేసే క్రమంలో తప్పకుండా ఫ్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని కోసం యోగా, వ్యాయామాల్లో ఎలాంటి నియమాలు అనుసరించాలో ఇప్పుడు ఆదివారం సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా వారంలో ఏడు రోజుల్లో ఒక్కొ నియమం పాటించాల్సి ఉంటుంది.


3. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోండి:
ప్రతిరోజు లాగా హెవీ స్పైసీ బ్రేక్‌ఫాస్ట్‌కు బదులుగా ఆదివారం రోజునా పోషకాలతో కూడిన అల్పాహారాన్ని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఆదివారం ప్రారంభించి.. ఇలా వారం రోజుల పాటు ఇలానే కొనసాగిస్తే భవిష్యత్‌లో మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి పూర్తిగా ఆరోగ్యంగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా మంచిది. అయితే ఈ క్రమంలో తప్పకుండా పండ్లను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..


Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook