Capsicum Juice For Weight Loss In 10 Days: మన శరీరానికి మేలు చేసే కూరగాయలు మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. అన్ని కాలాల్లోనూ ప్రస్తుతం కూరగాయలు తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అయితే చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూరగాయలను ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతోపాటు కూరగాయల నుంచి తీసిన రసాలను కూడా ఉదయం పూట తీసుకుంటున్నారు. ఆధునిక జీవనశైలిని దృష్టిలో పెట్టుకొని శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. దీంతోపాటు శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆధునిక జీవనశైలిని అనుసరించే చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే కొందరిలో ఈ సమస్యలు రావడానికి అధిక బరివే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఊబకాయం సమస్యతో బాధపడేవారు తీవ్ర వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా శరీర బరువును నియంత్రించుకోవాల్సి ఉంటుంది. బరువు పెరగడం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు కూరగాయలతో తయారుచేసిన జ్యూస్ లు ప్రభావంతంగా సహాయపడతాయి.


 Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  


ముఖ్యంగా శరీర బరువు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు క్యాప్సికంతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. క్యాప్సికం జ్యూస్ లో తక్కువ పరిమాణంలో కేలరీలు లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ రసాన్ని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


జ్యూస్ తయారీ పద్ధతి:
ఈ జ్యూస్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు క్యాప్సికం మొక్కలను చిన్నగా కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీటిని నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత నీటి నుంచి బయటకు తీసి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. ఆ తర్వాత గ్రైండర్ లో వేసి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గ్లాస్ లో సర్వ్ చేసుకుని తగినంత తేనెను కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


 Also Read:  Bandi Sanjay: కేసీఆర్.. క్యాన్సర్ కంటే డేంజర్.. నట్టేట ముంచిన బీఆర్ఎస్‌కు ఓటేస్తారా..?: బండి సంజయ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి