Weight Loss Diet: ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారు. ఎందుకంటే అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న బరువును నియంత్రించుకోవడం చాలా మంచిది.. లేకపోతే గుండెపోటు, మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. బరువు పెరుగుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తల తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా డైట్‌ పద్దతిలో ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా నిపుణులు సూచించిన ఈ అలవాట్లు కూడా పాటించాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి ఈ అలవాట్లు తప్పనిసరి:
నిద్ర అలవాట్లు:

బరువు పెరగకుండా ఉండడానికి నిద్ర అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది నిద్ర పోవడం మానుకుంటున్నారు. రోజూ 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంటేనే శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. 


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో


డైటింగ్ తప్పని సరా?:
ప్రస్తుతం చాలా మంది శరీర బరువును నియంత్రించుకోవడానికి  డైటింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ  డైటింగ్ చేసే క్రమంలో వైదులు సూచనల మేరకే పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


చురుకుగా ఉండాల్సిందే:
బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే తప్పకుండా ప్రతి రోజూ అరగంట వ్యాయామాలు చేయడం చాలా మంచిది. అంతేకాకుండా రోజంతా యాక్టివ్ గా ఉండాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజూ జీర్ణమయ్యే ఆహారలు మాత్రమే తీసుకోవాలి. ఇలాంటి ఆహారాలు తీసుకుంటేనే సులభంగా బరువు తగ్గుతారు. 


అతిగా తినొచ్చా?:
అతిగా ఆహారాలు తినడం వల్ల శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి అతిగా ఆహారాలు తినడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాల్లో ఎక్కువ చక్కెర పరిమాణాలున్న ఆహారాలు తినడం మానుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. 


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook