Weight Loss Diet: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ చిన్న చిట్కాతో బెల్లీ ఫ్యాట్, అధిక బరువుకు చెక్ పెట్టొచ్చా..?
Belly Fat Reduce Diet: బరువు తగ్గడానికి చాలా మంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కింద ఆరోగ్య నిపుణులు సూచించి చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Belly Fat Reduce Diet: బరువు పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో బరువు పెరగడం వల్ల ఊబకాయం, గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ పెరుగుతున్న శరీర బరువు నుంచి ఎంత అరోగ్యంగా ఉపశనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే బరువు పెరగడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. శరీర బరువును తగ్గించుకోవడానికి చాలా మంది డైట్స్‌ని ఫాలో అవుతుంటారు. దీనిని అనుసరించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే ఈ డైట్స్‌లో బరువు తగ్గించే పలు రకాల ఆహార పదార్థాలను వినియోగించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సోరకాయ:
సోరకాయలు మార్కెట్‌లో ప్రతి సీజన్‌లో లభిస్తాయి. కానీ చలి కాలంలో వీటి సాగు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విచ్చల విడిగా లభిస్తుంది. అయితే వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగిస్తే సులభంగా శరీర బరువుకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం పొటాషియం, జింక్ కాల్షియం, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటి ఆహారాల్లో వినియోగిస్తే శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
ఆల్మండ్(బాదం):
బాదంలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా వీటిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. కాబట్టి వీటిని ఉదయం పూట అల్పాహారంలో భాగంలో తీసుకుంటే శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మంచి కొవ్వులు శరీర బరువు తగ్గించడానికి సహాయపడతాయి. బాదంలో ప్రొటీన్, విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతి రోజులు తీసుకుంటే శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
పెరుగు:
పెరుగు కూడా శరీరానికి చాలా రకాల పోషక విలువలను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ B2, విటమిన్ B12, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో డైట్స్‌లో పెరుగుతో తయారు చేసిన ఆహారాలు వినియోగిస్తే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణ క్రియ శక్తిని పెంచి పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ డైట్స్‌లో పెరుగును వినియోగించాల్సి ఉంటుంది.
నిమ్మకాయ:
నిమ్మకాయలో కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల ఔషద గుణాలుంటాయి. కాబట్టి వీటిని బరువు తగ్గే క్రమంలో సలాడ్స్‌లో వినియోగిస్తే సలుభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే చాలా రకాల గుణాలుంటాయి. సీజనల్ వ్యాధుల్లో వచ్చే వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు తీసుకునే ఆహారాల్లో నిమ్మ రసం వినియోగిస్తే శరీరానికి చాలా మంచిది. అంతేకాకుంగా ఈ నిమ్మ రసాన్ని గ్రీన్ టీల్లో వినియోగిస్తే సులభంగా బెల్లీ ఫ్యాట్ నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook