Weight Loss Diet: బరువు పెరగడం పెరగడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది శరీరంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపోవడం వల్ల గుండెపోటే కాకుండా చాలా రకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో తినడం మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇంకా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే చాన్స్‌ ఉంది. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గడానికి తప్పకుండా ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అల్పాహారంలో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా బరువు కూడా తగ్గుతారు. అయితే బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్పాహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
సగ్గుబియ్యంతో చేసిన ఆహారాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఉదయం టిఫిన్‌లో ఖిచిడీ ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరాన్ని ఫిట్‌గా చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది.


పలు రాష్ట్రాల ప్రజలకు పోహా తినడం అలవాటుగా వస్తోంది. అయితే ప్రతి రోజూ పోహా తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


బొప్పాయి పండు తినడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా వీటిని ఉదయం పూట తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ తీసుకోవడం వల్ల కూడా సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


పెరుగులో ఫ్రూట్స్‌ మిక్స్ కలిపి తీసుకోవడం వల్ల కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి రోజు యాపిల్, దానిమ్మపండు కలపి తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Aso Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి


Also Read:l RGV on Pawan: గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.. పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook