Prolon Diet For Weight Loss: బరువు తగ్గడానికి చాలామంది వివిధ రకాల డైట్లను అనుసరిస్తూ ఉంటారు. అందులో బాగా ప్రాచుర్యం పొందింది కీటో డైట్. సెలబ్రిటీల నుంచి ప్రతి ఒక్కరు అనుసరించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కీటో డైట్ కంటే ప్రోలాన్ డైట్ కూడా శరీర బరువును తగ్గించడానికి ప్రభావంతంగా కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ డైట్ లో భాగంగా క్యాలరీలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డైట్ ను ప్రతిరోజు పాటించడం వల్ల ఎలా బరువు తగ్గుతారు మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోలాన్ డైట్‌లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసా..?


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోలాన్ డైట్ ప్లాన్‌ను ఫాస్టింగ్ మిమిక్కింగ్ డైట్ ప్లాన్ అని కూడా అంటారు. ఇటాలియన్ జీవశాస్త్రవేత్త, పరిశోధకుడిగా పనిచేస్తున్న డాక్టర్ వాటర్ ఈ డైట్ ప్లాన్‌ను రూపొందించారు. ప్రోలాన్ డైట్ ప్లాన్‌లో ఐదు రోజుల పాటు ప్రీప్యాకేజ్డ్ మీల్ కిట్‌లను తీసుకుంటారు. ఈ డైట్ ప్లాన్‌ని అనుసరించే వ్యక్తులు ఐదు రోజుల పాటు ఈ ప్రీప్యాకేజ్డ్ మీల్ కిట్‌ను మాత్రమే ఉపయోగించాలి. 


ఈ డైట్ ప్లాన్‌లో భోజనం అల్పాహారం స్నాక్స్ మొక్కల ఆధారిత ఆకులను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆహారాల్లో కార్బోహైడ్రేట్ల తక్కువగా ఉండే పదార్థాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఆహారాలను కేవలం ఐదు రోజులపాటు తీసుకుంటే ఫలితం తొందర్లోనే పొందుతారు.



ఈ డైట్లో భాగంగా కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది:


ఆల్గల్ ఆయిల్
డార్క్ చాక్లెట్
ఆలివ్
గ్లిసరాల్ ఆధారిత శక్తి పానీయాలు
ట్రిటికల్ సప్లిమెంట్స్
గ్రీన్ టీ
డ్రై ఫ్రూట్స్
ఎక్కువ నీరు త్రాగండి


ప్రోలాన్ డైట్  ప్రయోజనాలు:
ఈ డైట్ ని అనుసరించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
సులభంగా శరీర బరువు తగ్గగలుగుతారు. 
సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.


ప్రోలాన్ డైట్ యొక్క దుష్ప్రభావాలు:
ఇది చాలా ఖరీదైన డైట్. మధ్య తరగతి వ్యక్తులను అనుసరించడం చాలా కష్టం. 
ఈ డైట్ ప్లాన్‌ని అవలంబించడం ఖరీదైనది
డీహైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 
గర్భిణీలు, పాలిచ్చే స్త్రీలు ఈ డైట్ ను అనుసరించడం మంచిది కాదు. 
అలెర్జీలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


ఇది కూడా చదవండి : AAP as National Party: ఆప్‌కు అరుదైన గుర్తింపు, ఇక ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీ


ఇది కూడా చదవండి : Himachal pradesh Results: హిమాచల్‌లో కొనసాగిన సాంప్రదాయం, అధికారం కాంగ్రెస్ పరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook