Weight Loss Diet Plan: ఎలాంటి ఖర్చు లేకుండా 12 రోజుల్లో 3 కిలోల బరువు ఎలా తగ్గాలో తెలుసా..?
Weight Loss Diet Plan: జీవనశైలిలో మార్పుల కారణంగా చాలామంది అనారోగ్య సమస్యలతో పాటు స్థూలకాయం బారిన పడుతున్నారు.. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలను పాటించడం చాలా మంచిది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఆరోగ్యంగా నిపుణులు సూచించిన చిట్కాలతో బరువు తగ్గారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Weight Loss Diet Plan: స్లిమ్ గా అందంగా ఉంటేనే మనిషి ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అయితే ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా స్ట్రీట్ లో లభించే వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుని స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఈ సమస్యల బారిన సెలబ్రిటీలు కూడా పడుతున్నారంటే ఆసక్తికరంగా ఉంది. అనన్య పాండే సినిమాల్లోకి రాకముందు లావుగా ఉండేదంట. అయితే చేయడం ప్రారంభించిన తర్వాత స్లిమ్ గా ఫిట్ గా ఉండేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో మార్కెట్లో లభించే ఎలాంటి ప్రొడక్ట్స్ ను వినియోగించకుండా ఇంట్లో లభించే పలు వస్తువులతో సన్నగా మారిందని సమాచారం. బరువు తగ్గే క్రమంలో ఆమె యాపిల్ వెనిగర్ ని కూడా వాడిందని తెలుస్తోంది. ఈ యాపిల్ వెనిగర్ ని ఎలా ఉపయోగించడం వల్ల బరువు సులభంగా బరువు తగ్గుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యాపిల్ వెనిగర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గించేందుకు సులభంగా సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర బరువును తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో దీనిని వినియోగిస్తారు. అంతేకాకుండా ఇందులో జీర్ణక్రియను పెంచడానికి ఉపయోగపడే చాలా రకాల గుణాలు ఉంటాయి.
యాపిల్ వెనిగర్ ని ఇలా తాగండి:
గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల యాపిల్ వెనిగర్ ని తీసుకొని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగి బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందాల బ్యూటీ అనన్య పాండే కూడా ఇలానే చేసేదట.
బరువు తగ్గడానికి ఆమె ప్రతిరోజు ఇలా చేసేది:
బరువు తగ్గడానికి తప్పకుండా శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్లే పొట్ట పైన ఉన్న బెల్లీ ఫ్యాట్ సులభంగా తగ్గుతుంది. అయితే ప్రతిరోజు అనన్య పాండే వ్యాయామంతో పాటు యోగా, రన్నింగ్, డ్యాన్స్ చేసేదని తెలుస్తోంది.
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
యాపిల్ వెనిగర్ ను బరువు తగ్గే క్రమంలో అన్ని నిపుణులు సూచించిన మేరకే వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ అతిగా వినియోగిస్తే హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా వినియోగించడం వల్ల మధుమేహం, చర్మ సమస్యలు, ఎముకల బలహీనత వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బరువు తగ్గే క్రమంలో అతిగా వినియోగించకపోవడం చాలా మంచిది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Rakul Preet Lover : సాంటా ఇచ్చిన గిఫ్ట్ అదే.. లవర్‌కు రకుల్ ప్రీత్ స్పెషల్ విషెస్
Also Read : Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రయోగం.. సిరి, శ్రీహాన్‌లపై డబ్బులు పెడితే వస్తాయా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook