Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రయోగం.. సిరి, శ్రీహాన్‌లపై డబ్బులు పెడితే వస్తాయా?

Sekhar Master Produces OTT Web Series శేఖర్ మాస్టర్ ఈ మధ్య యూట్యూబ్‌లో నిర్మించిన చిన్న చిత్రాలు బాగానే క్లిక్ అవుతున్నాయి. శేఖర్ స్టూడియో అంటూ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తున్న వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 06:01 PM IST
  • నిర్మాతగా శేఖర్ మాస్టర్ సందడి
  • సిరి శ్రీహాన్‌లతో కొత్త వెబ్ సిరీస్
  • రొమాంటిక్ సీన్లతో జంట రెచ్చిపోయేనా?
Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రయోగం.. సిరి, శ్రీహాన్‌లపై డబ్బులు పెడితే వస్తాయా?

Sekhar Master Produces OTT Web Series with Siri And Shrihan శేఖర్ మాస్టర్ ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లో టాప్ స్థానంలో ఉన్నాడు. కొరియోగ్రఫీ చేస్తూనే బుల్లితెరపైనా షోలు చేస్తున్నాడు. అయితే శేఖర్ మాస్టర్ ఇప్పుడు మరో ఆదాయ మార్గాన్ని చూసుకున్నాడు. యూట్యూబ్‌లో శేఖర్ స్టూడియో అంటూ టెర్రస్ స్టోరీస్ అంటూ లఘు చిత్రాన్ని తీశాడు. ఇక అవి కాకుండా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ బాగానే వెనకేస్తున్నాడు. తన కూతురు, కొడుకులతో శేఖర్ మాస్టర్ చేసే ఫన్నీ వీడియోలు బాగానే వైరల్ అవుతుంటాయి.

ఇక ఇప్పుడు శేఖర్ మాస్టర్ పూర్తి స్థాయి నిర్మాతగా మారినట్టు కనిపిస్తోంది. సిరి, శ్రీహాన్‌లను పెట్టి ఓ కొత్త వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తోంది. ఈ మేరకు శ్రీహాన్ ఫుల్ ఖుషీ అవుతూ ఓ పోస్ట్ వేశాడు. ఇందులో శేఖర్ మాస్టర్‌ కొత్త వెబ్ సిరీస్‌ గురించి ప్రకటించేశాడు. ఈ సినిమాకు శేఖర్ మాస్టర్ నిర్మాతగా వ్యవహరించబోతోన్నాడట.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shrihan (@imshrihan)

దీని కోసమే నేను ఇన్ని రోజులు ఎదురుచూశాను.. ఇంకా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను.. ఇప్పుడు ఓటీటీలో వెబ్ సిరీస్‌తో రాబోతోన్నాను.. సిరితో కలిసి రాబోతోన్నాను.. ఈ వెబ్ సిరీస్‌ను శేఖర్ మాస్టర్ నిర్మిస్తాడని, సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడంటూ శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఆన్ స్క్రీన్ మీద కూడా ఈ జంట రొమాన్స్ చేయబోతోందన్న మాట.

ఇది వరకే యూట్యూబ్‌లో ఎన్నో లఘు చిత్రాల్లో కలిసి నటించింది ఈ జంట. మరి ఇప్పుడు శేఖర్ మాస్టర్‌ నిర్మించే వెబ్ సిరీస్‌లో ఎలాంటి పాత్రలు వేస్తారో.. రొమాన్స్‌లో ఇంకెంత హల్చల్ చేస్తారో చూడాలి. మరి శేఖర్ మాస్టర్‌కు వీరిపై పెట్టే డబ్బులు వెనక్కి వస్తాయా? లేదా? అన్నది చూడాలి.

Also Read : Samantha Ruth Prabhu : వారందరికీ నేను చెప్పదల్చుకున్నది ఇదే.. సమంత పోస్ట్ వైరల్

Also Read : Rakul Preet Lover : సాంటా ఇచ్చిన గిఫ్ట్ అదే.. లవర్‌కు రకుల్ ప్రీత్ స్పెషల్ విషెస్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News