Diabetic Patient Weight Loss: భారత్‌లో సుమారు 7.7 కోట్లు మంది మధమేహం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రపంచ దేశాలు భారతదేశాన్ని మధుమేహ రాజధానిగా పిలుస్తారు. ప్రస్తుతం డయాబెటిస్‌తో బాధపడుతున్న చాలా మందిలో ఊబకాయం సమస్యలు వస్తున్నాయి. ఇలా శరీర బరువు పెరగడం వల్ల గుండెపోటు ప్రమాదం వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి వీరు శరీర బరువును నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. డయాబెటిస్‌ ఉన్నవారిలో క్రమంగా శరీర బరువు పెరగడం కారణంగా  గుండె జబ్బులు, గుండెపోటు, నరాల బలహీనత సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు పెరగడానికి, మధుమేహం రావడానికి ప్రధాన కారణాలు జన్యుపరమైన కారణాలేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శరీరక శ్రమ చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. 


తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారాలు తీసుకోండి:
శుద్ధి చేసిన ఆహారాలు, జ్యూస్‌లు, స్వీట్లు, అనారోగ్యకరమైన ఆహారాల్లో అధిక పరిమాణంలో  కార్బోహైడ్రేట్‌లు అధికంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తక్షణమే పెంచుతాయి. కాబట్టి వైట్ రైస్, బ్రెడ్, పిజ్జా, అల్పాహారం తృణధాన్యాలు, పేస్ట్రీలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


ఫైబర్ గల ఆహారాలు తీసుకోండి:
మధుమేహంతో బాధపడుతున్నవారికి తృణధాన్యాలు, పప్పులు, చిక్కుళ్ళు, గింజలు, పండ్లు ప్రభావవంతంగా సహాయపడతాయి. ఇందులో ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి శరీర బరువును కూడా సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. టాప్ రికార్డ్స్ ఇవే!  


బయటి ఫుడ్‌ తక్కువ తినండి:
ప్రస్తుతం చాలా మంది రోడ్‌ సైడ్‌ అతిగా తింటున్నారు. వీటిని తినడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా పొట్ట సమస్యల బారిన కూడా పడుతున్నారు. రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి ప్రతి రోజు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 


ప్రతి రోజు వ్యాయామాలు తప్పకుండా చేయాలి: 
మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా శారీరక శ్రమ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల  ఇన్సులిన్‌పై ప్రభావం చూపి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. టాప్ రికార్డ్స్ ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.