Weight Loss Drink In Morning: బరువు తగ్గడానికి డైట్ కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గే క్రమంలో సరైన ఆహారాలు తీసుకుంటేనే సులభంగా బరువు తగ్గుతారని డైటీషియన్లు చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వాటిని పాటించక వాళ్లకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి డైటీషియన్లు చెబుతున్న డైట్లను పాటించి సులభంగా బరువు తగ్గాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలతో బరువు తగ్గడమే కాకుండా జుట్టు రాలడం పొట్ట ఉబ్బరం ఆసిడిటీ వికారం అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి అనుసరించే డైట్లలో ఈ ఈ డ్రింక్ ని ప్రతిరోజు తాగితే సులభంగా ఫలితం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చలికాలంలో వచ్చే జలుబు సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టూ ఉన్న కొలెస్ట్రాలను కూడా సులభంగా తగ్గిస్తాయి. ఇంతకీ ఈ డ్రింక్ ఏంటి అని అనుకుంటున్నారా.. ఇప్పుడే ఆ డ్రింకు గురించి తెలుసుకుందాం..


పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్, బరువును తగ్గించడానికి తీసుకోవాల్సిన డ్రింక్ తయారీ:


డ్రింకు కావాల్సిన పదార్థాలు: 
నీరు - సుమారు 2 గ్లాసులు 
కరివేపాకు - 7 నుండి 8 రెమ్మలు
కొత్తిమీర గింజలు - ఒక టీస్పూన్ 
జీలకర్ర - ఒక టీ స్పూను 
నల్ల ఏలకులు - ఒకటి మాత్రమే 
అల్లం - 1 ముక్క తురుముకోవాలి


తయారీ ప్రక్రియ:
బరువు తగ్గడానికి డ్రింకు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించాలి. ఆ తర్వాత దానిపై ఒక కప్పు పెట్టి అందులో రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఆ తర్వాత వాటిని 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. అందులో 8 రెమ్మల కర్వేపాకు వేసి.. ఓ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేయాలి. ఇలా వేసిన వాటిని ఉడికించాల్సి ఉంటుంది. అందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా ఉడికించి ఫిల్టర్ చేయాలి. ఇలా ఫిల్టర్ చేసిన డ్రింకులో తేనె వేసి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే సులభంగా అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Also Read : Avatar The Way Of Water టికెట్ రేట్లు.. జేబులు గుల్ల అవ్వాల్సిందేనా?


Also Read : Keerthy Suresh pics : 8వ శతాబ్దం నాటి పురాతన గుడిలో మహానటి.. కీర్తి సురేష్ ఎంత సింపుల్‌గా ఉందో.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook