Weight Loss Drink: బరువు పెరగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీంతో ఊబకాయం పెరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. బరువు పెరగడం వల్ల అందం దెబ్బతినడమే కాకుండా అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల అధిక బరువును నియంత్రించుకోవడమే మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గేందుకు మొదట చేయాల్సిన పని భోజనం తగ్గించడం, స్వీట్లకు దూరంగా ఉండటం. దీంతో పాటు క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం మేలు. ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. ఆశించిన ఫలితం రాని క్రమంలో చాలా మంది విసుగు చెందుతున్నారు. అలాంటి వారు తమ డైట్ లో ఈ డ్రింక్ చేర్చుకోవడం మంచిది. లెమన్ కాఫీ వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చని మీకు తెలుసా? అయితే అది ఎలా తయారు చేయాలి. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 


బరువు తగ్గడానికి లెమన్ కాఫీ..


బరువు తగ్గేందుకు లెమన్ కాఫీని ఉపయోగిస్తారు. అందులో కాఫీలో నిమ్మరసం కలిపి తాగుతారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ నిల్వ ఉండే అదనపు కొవ్వును కరిగించేందుకు ఇది మేలు చేస్తుందని అంటున్నారు.


లెమన్ కాఫీలో చక్కెర కలపొద్దు!


లెమన్ కాఫీ నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందేందుకు మీరు పాలతో తయారు చేసిన కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీని ఉపయోగించాలి. అందులో చక్కెరను కలపకూడదు. బదులుగా, సగం నిమ్మరసం పిండాలి. ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా త్రాగడం వల్ల కొన్ని రోజుల్లో మీ బరువును తగ్గుతుంది.


లెమన్ కాఫీ ప్రయోజనాలు..


- నిమ్మకాయ, కాఫీ రెండింటిలో చాలా పోషకాలు ఉన్నాయి. అందుకే అవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి.


- నిమ్మకాయ, కాఫీలో బరువు తగ్గించే గుణాలు ఉన్నాయి.


- కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. మనస్సును రిఫ్రెష్ చేస్తుంది.


- మరోవైపు నిమ్మరసం తాగడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయదు. ఈ కారణంగా తక్కువ కేలరీలు తిని బరువు తగ్గొచ్చు. 


- వీటితో పాటు నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉన్నాయి. అవి ఫ్రీ రాడికల్స్ ను రక్షణని ఇస్తాయి. 


(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


ALso Read: Skin Tan Removal: ఈ 5 రకాల నేచురల్ టిప్స్ తో సన్ ట్యానింగ్ ను దూరం చేసుకోవచ్చు!


Also Read: Mango Protein Shake: మ్యాంగో ప్రొటీన్ షేక్‌తో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook